Chief Ministers of Andhra Pradesh (1956-2014) – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు విశేషాలు:

Chief Ministers of Andhra Pradesh

1956 నుంచి 2014కు మధ్యగల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమంత్రులు, వారి పాలనలోని విశేషాలు:

APPSC, TSPSC గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల కోసం, మరియు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం 1956 – 2014 ల మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల వివరాలను, విశేషాలను మీకు అందిస్తున్నాము.

నీలం సంజీవరెడ్డి (1956 నవంబర్ 1 -1960 జనవరి 11)

 • వీరిది అనంతపురం జిల్లా
 • నీలం సంజీవరెడ్డి తన మొదటి మంత్రివర్గాన్ని 13 మందితో (1+12) ఏర్పాటు చేశాడు.
 • ఇతని మంత్రివర్గంలోని ప్రముఖులు:
  -కేవీ రంగారెడ్డి- హోం
  -బెజవాడ గోపాలరెడ్డి- ఆర్థిక
  -దామోదరం సంజీవయ్య- కార్మిక
  -కాసుబ్రహ్మానందరెడ్డి- స్థానిక పాలన
  -మందుముల నరసింగరావు- రోడ్లు, భవనాలు
  -జేవీ నరసింగరావు- నీటిపారుదల, విద్యుత్
  -మెహదీ నవాజ్జంగ్-సహకారం, గృహ నిర్మాణం
  -కళా వెంకట్రావు- రెవెన్యూ
  -బసవరాజు- ప్రణాళికాభివృద్ధి
  -పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి- వ్యవసాయం
  -పట్టాభి రామారావు- విద్య
  -వెంకటరెడ్డి నాయుడు- న్యాయశాఖ
 • నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవి 6వ వేలు వంటిదని పేర్కొని ఆ పదవిని ఏర్పాటు చేయడానికి నిరాకరించారు.
 • 1957లో పార్లమెంట్ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ను తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.
 • 1958లో 90 మంది సభ్యులతో శాసనమండలి ఏర్పాటయ్యింది. -దీనికి మొదటి చైర్మన్- మాడపాటి హనుమంతరావు
 • 1958లో 20 మంది సభ్యులతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి అచ్యుతరెడ్డి నేతృత్వంలో ఏర్పడింది.
 • 1958లో ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటయ్యింది.
 • 1959లో ఏపీఎస్ఈబీ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు) ఏర్పడింది.
 • 1959లో మూడంచెల పంచాయతీరాజ్ విధానం ప్రవేశపెట్టారు.
 • 1959లో స్వతంత్ర పార్టీ (ఎన్జీ రంగా, రాజాజీలు నెహ్రూ విధానాలకు వ్యతిరేకంగా)ని స్థాపించారు.
 • 1960లో నీలం సంజీవరెడ్డి జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో అతను సీఎం పదవికి రాజీనామా చేశాడు.

దామోదరం సంజీవయ్య (1960 జనవరి 11 – 1962 మార్చి 12)

 • వీరిది కర్నూలు జిల్లా
 • ఇతను దేశంలోనే మొదటి హరిజన ముఖ్యమంత్రి. అతి పిన్నవయస్సులో ముఖ్యమంత్రి అయ్యారు. (39 ఏండ్లు)
 • ఇతను పెద్దమనుషుల ఒప్పందాన్ని గౌరవిస్తూ 1961లో కేవీ రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. హరిజన-గిరిజన చట్టాన్ని తీసుకొచ్చి వారికి కేటాయించిన ఉద్యోగాలను లేదా సీట్లను వారితో మాత్రమే భర్తీ చేసేలా చర్యలు చేపట్టారు.
 • 1962లో ఇతను జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
 • జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్న నీలం సంజీవరెడ్డి మళ్లీ ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాడు.

నీలం సంజీవరెడ్డి (1962 మార్చి 12-1964 ఫిబ్రవరి 20)

 • ఇతను పాఠ్యపుస్తకాలను జాతీయీకరణ చేశాడు.
 • శాసనసభలో ఇతని బద్ధశత్రువు పిడతల రంగారెడ్డి (కర్నూలు).
 • పిడతల రంగారెడ్డికి కర్నూలులో ప్రైవేట్ బస్సురూట్ ఉండేది.
 • కోట్ల విజయభాస్కరరెడ్డికి కూడా కర్నూలులో ప్రైవేట్ బస్సు రూట్ ఉండేది.
 • పిడతల రంగారెడ్డిని ఆర్థికంగా దెబ్బతీయడానికి నీలం సంజీవరెడ్డి కర్నూలు ప్రైవేట్ బస్రూట్ను జాతీయీకరణ చేశారు.
 • దీన్ని ఖండిస్తూ కోట్ల విజయభాస్కరరెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు.
 • కర్నూలు ప్రైవేట్ బస్ రూట్ జాతీయీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
 • దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నీలం సంజీవరెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి కాసు బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిగా నామినేట్ చేశారు.

కాసు బ్రహ్మానందరెడ్డి (1964 ఫిబ్రవరి 21 – 1971 సెప్టెంబర్ 30)

 • వీరిది గుంటూరు జిల్లా
 • 1966లో తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషగా ప్రకటించారు.
 • 1966లో విశాఖపట్నంలో ఇనుము-ఉక్కు కర్మాగారం స్థాపించాలని పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. ఈ సందర్భంగా తెన్నేటి విశ్వనాథం విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇచ్చాడు.
 • 1967లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేశారు. (1955లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి)
 • 1966-67లో కాసు బ్రహ్మానందరెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డీఎస్ రెడ్డిల మధ్య అనేక విభేదాలు చోటుచేసుకున్నాయి.
 • కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఉస్మానియా విశ్వ విద్యాలయ వైస్ చాన్స్లర్ పదవీ కాలాన్ని 5 నుంచి 3 ఏండ్లకు తగ్గించి డీఎస్ రెడ్డిని వైస్ చాన్స్లర్ పదవి నుంచి తొలగించింది. -దీన్ని వ్యతిరేకిస్తూ దీఎస్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు.
 • ప్రభుత్వ ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
 • దీంతో డీఎస్ రెడ్డి మళ్లీ వైస్ చాన్స్లర్గా నియమితులయ్యాడు.
 • 1969లో తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది.
 • 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి 10 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది.
 • 1971 సెప్టెంబర్లో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
 • 1969లోనే ఉత్తర కోస్తాలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది.
 • అప్పటి హోంమంత్రి జలగం వెంగళరావు కఠినంగా వ్యవహరించి నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేశారు.
 • 1970లో ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.
 • 1971లో తెలంగాణకు చెందిన వారిని ముఖ్యమంత్రిని చేయడానికి కేబీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
 • దీంతో కరీంనగర్కు చెందిన పీవీ నర్సింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.

పీవీ నరసింహారావు (1971 సెప్టెంబర్ 30 – 1973 జనవరి 10)

 • ఈయన తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి.
 • ఈయన కరీంనగర్ జిల్లాకు చెందినవారు.
 • ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి భూముల కొనుగోలును నియంత్రించారు.
 • ముల్కీ నిబంధనలను కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు.
 • అనేక మంది స్థానికేతర ఉద్యోగులను తమ తమ ప్రాంతాలకు పంపించడం ప్రారంభించారు.
 • దీంతో ఏవీ సుబ్బారెడ్డి, కాకాని వెంకటరత్నం, వసంత నాగేశ్వరరావు జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు.
 • జై ఆంధ్ర ఉద్యమం కారణంగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.
 • దీంతో 1973 జనవరి 17న పీవీ నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
 • 1973 జనవరి 18న ఆంధ్రప్రదేశ్లో రాష్ర్టపతి పాలన విధించారు.

రాష్ర్టపతి పాలన (1973 జనవరి 18 – 1973 డిసెంబర్ 10)

 • అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్. ఇతని సలహాదారు హెచ్సీ శరీన్.
 • ఆంధ్రప్రదేశ్లో రాష్ర్టపతి పాలనాకాలాన్ని శరీన్ పాలనా కాలం అంటారు.
 • శరీన్ అనేక వ్యూహాలు పన్ని జై ఆంధ్ర ఉద్యమ తీవ్రతను తగ్గించారు.
 • 1973, అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం జై ఆంధ్ర ఉద్యమాన్ని పూర్తిగా అంతం చేయడానికి 6 సూత్రాలను ప్రకటించింది.
 • 1973 డిసెంబర్లో 32వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఈ 6 సూత్రాలను చేర్చారు.
 • అప్పటి నుంచే ఆంధ్రలో జోనల్ విధానం అమలులోకి వచ్చింది.హైదరాబాద్లో కొన్ని శాఖలను ఫ్రీ జోన్గా ప్రకటించారు.
 • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కే రోశయ్య కాలంలో శాసనసభ హైదరాబాద్ పోలీస్ శాఖను ఫ్రీ జోన్గా పరిగణించకూడదని పేర్కొంటూ ప్రెసిడెంట్ ఆర్డర్ 14ఎఫ్ క్లాజ్ను తొలగించాల్సిందిగా ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది.
 • హైదరాబాద్ పోలీస్ శాఖను 6వ జోన్ కింద పరిగణించాలని పేర్కొన్నది. దీంతో ఈ క్లాజ్ తొలగిపోయింది.
 • రాష్ర్టపతి పాలనా కాలంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో సీఎంగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం చేశారు.

జలగం వెంగళరావు (1973 డిసెంబర్ 10 -1978 మార్చి 6) 

 • ఈయన ఖమ్మం జిల్లాకు చెందినవారు.
 • 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో జరిగాయి. దీని నిర్వహణలో ఎంవీ కృష్ణారావు కీలక పాత్ర పోషించారు.
  ప్రపంచ తెలుగు మహాసభలు
  1. హైదరాబాద్ 1975
  2. కౌలాలంపూర్ (మలేషియా) 1981
  3. మారిషస్ 1990
  4. తిరుపతి 2012
 • ఇతనికాలంలో 1975-1977 మధ్యకాలంలో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
 • 1978లో కాసు బ్రహ్మానందారెడ్డికి ఇందిరాగాంధీతో విభేదాలు ఏర్పడడంతో రెడ్డి కాంగ్రెస్ను స్థాపించారు.
 • జలగం వెంగళరావు.. రెడ్డి కాంగ్రెస్లో చేరారు.
 • 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రెడ్డి కాంగ్రెస్ పరాజయం పాలైంది.
 • దీంతో జలగం వెంగళరావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
 • 1978-83 మధ్య కాలంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్లో నలుగురు ముఖ్యమంత్రులను మార్చింది.

మర్రి చెన్నారెడ్డి (1978 మార్చి 6 – 1980 అక్టోబర్ 11) 

 • ఈయన రంగారెడ్డి జిల్లాకు చెందినవారు.
 • ఈయన గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర బృందాన్ని రోమ్ పట్టణానికి తీసుకొనిపోయి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో సాధించిన విజయాల గురించి వివరించారు.
 • ఇతని కాలంలో 1978లో రంగారెడ్డి, 1979లో విజయనగరం జిల్లాలు ఏర్పాటయ్యాయి.
 • ఈయన ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు ప్రవేశపెట్టారు. దీన్ని అంజయ్య సర్కారు రద్దు చేసింది.
 • అధికంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
 • ఇతను తన షష్టిపూర్తిని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడంతో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
 • చివరకు అధిష్ఠానం ఆదేశం మేరకు రాజీనామా చేశారు.

టంగుటూరి అంజయ్య (1980 అక్టోబర్ 11 – 1982 ఫిబ్రవరి 24) 

 • ఈయన మెదక్ జిల్లాకు చెందినవారు.
 • నిరుపేద కుటుంబానికి చెందినవారు.
 • హైదరాబాద్లోని ఆల్విన్ కంపెనీలో 6 అణాలకు రోజువారి కూలీగా పనిచేశారు.
 • కార్మిక నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యారు.
 • ఇతని మంత్రివర్గంలో 72 మంది మంత్రులు (జంబో కేబినెట్) ఉండేవారు.
 • ఈ మంత్రివర్గంలోనే వైఎస్సార్ గ్రామీణ అభివృద్ధి మంత్రిగా, చంద్రబాబునాయుడు సినిమాటోగ్రఫి మంత్రిగా పనిచేశారు.
 • పదేండ్లు వాయిదా పడుతూ వస్తున్న స్థానికసంస్థల ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడింది. స్థానిక సంస్థల్లో మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు.
 • హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్గాంధీచే అవమానానికి గురయ్యారు.
 • ఇతడు జంబో కేబినెట్ను కుదిస్తున్నప్పుడు మంత్రి పదవులు కోల్పోయినవారు ఇతనిపై తిరుగుబాటు ప్రకటించారు.
 • చివరకు అధిష్ఠానం ఆదేశం మేరకు ఇతను రాజీనామా చేశారు.

భవనం వెంకట్రామిరెడ్డి (1982 ఫిబ్రవరి 24 – 1982 సెప్టెంబర్ 20)

 • ఈయన గుంటూరు జిల్లాకు చెందినవారు.
 • శాసనమండలి నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటివారు.
 • ఇతని కాలంలోనే 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
 • ఇతను ఎన్టీఆర్ను ఎదుర్కోలేడని భావించిన అధిష్ఠానం, ఇతన్ని తొలగించి కోట్ల విజయభాస్కరరెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది.

కోట్ల విజయభాస్కరరెడ్డి (1982 సెప్టెంబర్ 20 – 1983 జనవరి 9) 

 • ఈయన కర్నూలు జిల్లాకు చెందినవారు.
 • ఇతను రూ.1.90/- పైసలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు.
 • 1982-83లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 202 సీట్లు గెలుచుకొని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

నందమూరి తారక రామారావు 

 • కృష్ణా జిల్లాకు చెందినవారు.
 • 1983 జనవరి 9న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో తన పేరును నమోదు చేసుకున్నారు.
 • ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉన్నతాధికారులు ఐఏఎస్, ఐపీఎస్ల అవినీతిని నిర్మూలించడానికి ప్రయత్నించారు.
  -దీని కోసం ధర్మ మహామాత్య అనే పదవిని ఏర్పాటు చేశారు.
 • తనకు సన్నిహితుడైన రామిరెడ్డిని ధర్మ మహామాత్యగా నియమించారు.
 • రామిరెడ్డి హఠాత్తుగా ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఇండ్లపై దాడులు చేసేవారు.
 • దీంతో ప్రారంభంలోనే అధికారుల మద్దతు కోల్పోయారు.
 • ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా కార్యాలయంలోనే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.
  -ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 55 ఏండ్లకు తగ్గించారు.
 • దీంతో ప్రభుత్వ ఉద్యోగులు 2 నెలల పాటు సమ్మె చేశారు.
 • అయినప్పటికీ ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.
 • 1984 జనవరిలో గ్రామ అధికారుల పదవులను రద్దు చేశారు.
 • అర్చకుల వారసత్వాన్ని కూడా రద్దు చేశారు.
 • తన మంత్రివర్గంలోని కేబినెట్ మంత్రి అయిన రామచంద్రరావు అవినీతికి పాల్పడుతున్నాడని అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించారు.
 • శాసన మండలి కారణంగా పరిపాలనా నిర్ణయాల్లో స్తబ్దత ఏర్పడుతుందని భావించిన ఎన్టీఆర్ శాసనమండలిని రద్దుచేయడానికి అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. -దీంతో సొంత పార్టీకి చెందిన నాయకులు ఎన్టీఆర్కు వ్యతిరేకమయ్యారు.
 • 1984 జూన్, జూలైలో బైపాస్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసి గవర్నర్ రాంలాల్గిరా సహాయంతో 1984 ఆగస్టు 16న ముఖ్యమంత్రి అయ్యారు.
 • 1984 ఆగస్టు 16 నుంచి 1984 సెప్టెంబర్ 16 మధ్యకాలంలో ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో పోరాటం చేశారు.
 • అప్పుడే చైతన్య రథయాత్రలను చేపట్టారు. హరికృష్ణ రథసారథిగా వ్యవహరించారు.
 • తిరుగుబాటు ఎమ్మెల్యేలను తిరిగి ఎన్టీఆర్ వర్గంలోకి తీసుకురావడంలో చంద్రబాబునాయుడు కీలక పాత్ర పోషించారు.
 • ఎన్టీఆర్ తన మద్దతు ఎమ్మెల్యేలతో రాష్ర్టపతి జైల్సింగ్ను కలిసి తన ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జైల్సింగ్ ఆంద్రప్రదేశ్ గవర్నర్ రాంలాల్ను విమర్శించారు.
 • మనస్తాపానికి గురైన రాంలాల్ రాజీనామా చేయడంతో శంకర్దయాల్శర్మ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు.
 • శంకర్దయాల్శర్మ ఆదేశం మేరకు 1984 సెప్టెంబర్ 16న నాదెండ్ల భాస్కరరావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
 • దీంతో 1984 సెప్టెంబర్ 16న ఎన్టీఆర్ 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
 • తనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు తమ పదవులలో కొనసాగకూడదని భావించిన ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాల్సిందిగా గవర్నర్ను కోరారు.
 • దీంతో 1984 సెప్టెంబర్ 24 నుంచి 1985 మార్చి 8 వరకు ఎన్టీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
 • ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీ మళ్లీ 202 సీట్లు గెల్చుకుంది.
 • 1985 మార్చి 9న ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
 • ఎన్టీఆర్ నిజమైన పాలన అప్పటి నుంచే ప్రారంభమైంది.
 • 1985లో శాసనమండలి రద్దు అయింది.
 • 1985 సెప్టెంబర్లో తండ్రి ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు.
 • 1985 డిసెంబర్లో స్థానికేతరులను వారివారి ప్రాంతాలకు పంపడానికి 610 జీఓను తీసుకువచ్చారు. -కానీ ఈ జీవో సరిగా అమలు కాలేదు.
 • హుస్సేన్సాగర్లో బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పారు.
 • తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేశారు.
 • తాలూకా వ్యవస్థను రద్దుచేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు.
 • 1988లో మంత్రిమండలి నిర్ణయాలు మీడియాకు తెలుస్తున్నాయనే కారణంతో మంత్రిమండలిని రద్దు చేసి మళ్లీ 3 రోజులకు కొత్త మంత్రి మండలిని ఏర్పాటు చేశారు.
 • ఈ సమయంలో ఎన్టీఆర్పై అవినీతి ఆరోపణలు అధికమయ్యాయి.
 • విశాఖపట్నానికి చెందిన ద్రోణంరాజు సత్యనారాయణ ఎన్టీఆర్ ఆస్తులపై విచారణ జరుపాల్సిందిగా హైకోర్టులో పిల్ వేశారు.
 • ముఖ్యమంత్రిగా విశ్వామిత్ర అనే చిత్రంలో నటించడంతో ఎన్టీఆర్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
 • 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది.
 • 1989-94 మధ్యకాలంలో ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
 • జాతీయ స్థాయిలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్కు చైర్మన్గా వ్యవహరించారు.
 • ఈ మధ్య కాలంలోనే లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు.
 • 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (మిత్ర కూటమితో కలిసి) అత్యధికంగా 246 సీట్లు గెల్చుకుంది.
 • కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లు గెలుచుకొని ప్రతిపక్ష పార్టీ హోదాను కోల్పోయింది.
 • 1994 డిసెంబర్ 12న ఎన్టీఆర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అదే రోజున ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధంను అమలుచేశారు.
 • 1995 ఆగస్టు సంక్షోభం/చంద్రబాబునాయుడు తిరుగుబాటు కారణంగా ఎన్టీఆర్ తన పదవిని కోల్పోయారు.
 • 1996 జనవరి 18న ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారు.

నాదెండ్ల భాస్కరరావు (1984 ఆగస్టు 16 – 1984 సెప్టెంబర్ 16)

 • ఈయన గుంటూరు జిల్లాకు చెందినవారు.
 • రాంలాల్ ఇతన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
 • ఇతను ధర్మ మహామాత్య పదవిని రద్దు చేశారు.
 • ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 55 నుంచి 58 ఏండ్లకు పెంచారు.
 • గవర్నర్ శంకర్‌దయాల్‌శర్మ ఆదేశం మేరకు ఇతను తన పదవికి రాజీనామా చేశారు.

మర్రి చెన్నారెడ్డి (1989 డిసెంబర్ 3 – 1990 డిసెంబర్ 17)

 • ఈయన రంగారెడ్డి జిల్లాకు చెందినవారు.
 • 1989 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 186 సీట్లు గెలుచుకుంది.
 • హైదరాబాద్‌లోని మతకల్లోల కారణంగా ఇతను తన పదవిని కోల్పోయారు.

నేదురుమల్లి జనార్దనరెడ్డి (1990 డిసెంబర్ 17 – 1992 అక్టోబర్ 9)

 • ఈయన నెల్లూరు జిల్లాకు చెందినవారు.
 • 14 డెంటల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి.
 • ఇతను అధికంగా ప్రొఫెషనల్ కాలేజీలు ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.
 • గ్రానైట్ లీజ్ వ్యహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
 • ఇతను కూడా హైదరాబాద్ మతకల్లోల కారణంగా పదవిని కోల్పోయారు.

కోట్ల విజయభాస్కరరెడ్డి (1992 అక్టోబర్ 9 – 1994 డిసెంబర్ 12)

 • ఈయన కర్నూలు జిల్లాకు చెందినవారు.
 • ఇతను సారాను నిషేధించారు.
 • 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యల్పంగా 26 సీట్లు మాత్రమే గెలుచుకొని, ప్రతిపక్షపార్టీ హోదాను కూడా కోల్పోయింది.

నారా చంద్రబాబునాయుడు (1995 సెప్టెంబర్ 1 – 2004 మే 13)

 • ఈయన చిత్తూరు జిల్లాకు చెందినవారు.
 • ఇతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు.
 • దేశంలో హైటెక్ ముఖ్యమంత్రిగా ప్రసిద్ధి చెందారు.
 • ఇతని ప్రధాన కార్యక్రమాలు
  -జన్మభూమి (దక్షిణ కొరియాలోని సెమల్ అన్‌డంగ్ అనే కార్యక్రమం ఆధారంగా 1997లో ప్రారంభం)
  -నీరు – మీరు, ప్రజల వద్దకు పాలన
  -ముందడుగు,
  -విజన్ 2020 అనే పథకాన్ని అమెరికాకు చెందిన మెక్‌కిన్లే అనే సంస్థతో రూపొందించి స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ప్రయత్నించారు.
  -గతంలో దక్షిణ అమెరికాలోని పెరూ దేశం ఇటువంటి పథకం ద్వారా విజయం సాధించింది.

వైఎస్.రాజశేఖర్‌రెడ్డి (2004 మే 14- 2009 సెప్టెంబర్ 2)

 • ఈయన కడప జిల్లాకు చెందినవారు.
 • 2003 ఏప్రిల్-మే నెలలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు 1500 కి.మీ.ల పాదయాత్ర నిర్వహించారు.
 • 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై మొదటి సంతకం చేశారు.
 • ఇతని కార్యక్రమాలు- జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ గృహాలు
 • 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో కర్నూలులోని ఆత్మకూరు సమీపాన గల పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

కే రోశయ్య (2009 సెప్టెంబర్ 2 – 2010 నవంబర్ 23)

 • ఈయన గుంటూరు జిల్లాకు చెందినవారు.
 • ఇతను శాసనమండలి నుంచి ముఖ్యమంత్రి అయిన 2వ వ్యక్తి.
 • ఇతని కాలంలో తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది.
 • బడ్జెట్‌ను అత్యధికంగా 16 సార్లు ప్రవేశపెట్టారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి (2010 నవంబర్ 24 – 2014 మార్చి 1)

 • ఈయన చిత్తూరు జిల్లాకు చెందినవారు.
 • ఇతను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
 • 1989, 1999, 2004 వాయల్పాడు నియోజకవర్గం నుంచి, 2009లో పీలేరు నియోజకవర్గం నుంచి గెలిచారు.
 • ఇతని కార్యక్రమాలు
  -రాజీవ్ యువ కిరణాలు, రూపాయికే కిలోబియ్యం
  -రచ్చబండ, బంగారుతల్లి
  -ఇందిరా క్రాంతి, మీ సేవ మొదలైనవి.
 • ఇతని కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైంది.
 • పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదించిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు.

Comment here!