Group -1, 2 Interview Preparation: ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావడానికి గల 7 కారణాలు

APPSC TSPSC Group -1 & 2 Interview Preparation Tips, Strategy, Planning

APPSC & TSPSC Group -1, Group -2 Interview Preparation – 7 Reasons for getting less marks in Interview – ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావడానికి గల 7 కారణాలు

సివిల్ సర్వీసెస్, గ్రూప్ -1, గ్రూప్ -2 లాంటి ఇంటర్వ్యూలలో అభ్యర్థులు తాకువ మార్కులు తెచ్చుకోవడానికి 7 కారణాలు ఉన్నాయి. వీటిని కనుక అభ్యర్థులు అధిగమిస్తే అత్యధిక మార్కులు కాకపోయినా కనీసం మంచి మార్కులు సాధించవచ్చు.

  1. ఆలస్యంగా ఇంటర్వ్యూ హాల్‌కి చేరుకోవడం : సమయపాలన పాటించక పోవడం, ఆలస్యంగా చేరుకోవడం అనేది మీ నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. అలాగే ఆలస్యంగా వెళ్ళడం వలన మరింత ఎక్కువ ఒత్తిడికి లోనై ఇంటర్వ్యూ సరిగ్గా  చేయలేరు.
    సలహా : కనీసం అరగంట ముందు ఇంటర్వ్యూ ప్రాంగణానికి చేరుకోండి.
  2. నప్పని దుస్తుల్లో వెళ్లడం : కాజువల్ డ్రసెస్, ముడుతలు పడి నలిగిపోయిన దుస్తులు ధరించడం, పాలిష్ లేని షూ వేసుకోవడం, మీకు వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడాన్ని ఉద్యోగం పట్ల అనాసక్తిని సూచిస్తుంది.
    సలహా : చక్కటి దుస్తులు ధరించి, పాలిష్ చేసిన షూ ధరించి వెళ్లండి.
  3. చిన్న చిన్న మాటలతో సమాధానం చెప్పడం: అవును/కాదు/ లేదు అని కానీ ముక్తసరిగా పొడి మాటలతో చిన్న సమాధానం చెప్పటం. ఇది ఉద్యోగం పట్ల మీ అయిష్టతను సూచిస్తుంది. అదే విధంగా మీకు వాక్‌చాతుర్యం లేదేమో అనే అనుమానాలకు ఆస్కారం ఇస్తుంది. ముఖ్యంగా విషయ పరిజ్ఞాన లేమికి, అజ్ఞానికి కూడా ఇది బలమైన నిదర్శనం. ఇది వినయానికి సూచన కాదు. అలాగనీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు కూడా ఇవ్వొద్దు
    సలహా : ప్రశ్న పూర్తిగా అర్థం చేసుకొని చిరునవ్వుతో పూర్తి వాక్య నిర్మాణం చేస్తూ అవసరమైన వివరాలు అందిస్తూ పూర్తి సమాధానం ఇవ్వండి.
  4. బాడీ లాంగ్వేజి : కుర్చీలో చేరగిలపడిపోయి కూర్చోవడం, నిరాసక్తంగా చూడటం, ఆవలించడం, కాళ్లు బార్లా చాపుకోవడం, చేతులు టేబుల్‌పై పెట్టి మాట్లాడటం, మీ ఫైల్స్‌ను టేబుల్‌పై ఉంచడం మొదలైనవి మీ క్రమశిక్షణారాహిత్యాన్ని సూచిస్తాయి.
  5. EYE CONTACT లేకపోవడం: చూపు కలిపి మాట్లాడకపోవడం, ఎటో చూస్తూ మాట్లాడటం. ఇది మీకు ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని సూచిస్తుంది. మీరు అబద్ధం చెపుతున్నారేమోననే అనుమానానికి ఆస్కారం ఉంది.
    సలహా : చూపు కలిపి హాయిగా మాట్లాడండి. ప్రశ్న ఒక్కరే అడిగినప్పటికీ సమాధానం అందరి వైపు చూస్తూ చెప్పండి.
  6. పరిజ్ఞానం లోపించడం : మీరిచ్చే సమాధానాల ద్వారా మీ పరిజ్ఞాన లేమి తెలిసిపోతుంటుంది. అలా అని తెలియని విషయాలు తెలిసినట్టు నటించవద్దు. తెలియదని చెప్పటం మంచి పద్ధతి.
    సలహా : మీరు చదివిన చదువుకు సంబంధించి లోతైన పరిజ్ఞానం కలిగి ఉండటం మీ కనీస బాధ్యత. దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు.
  7. తగిన ధ్రువపత్రాలు లేకపోవడం : మీరు బయోడేటాలో  పేర్కొన్న ప్రతి అంశానికి, ప్రతి విజయానికి సంబంధించి తగిన ఆధార పత్రాలు, ధ్రువపత్రాలు మీ దగ్గర సిద్ధంగా లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది.
    సలహా: బయోడేటాలో పేర్కొన్న ప్రతి అంశానికి సంబంధించి ధ్రువపత్రాలు, ఫొటోగ్రాఫ్‌లు, అవసరమైతే మీ విజయాలకు సంబంధించిన ఆధారాలు దలైనవి మీతో తీసుకెళ్లడం మరిచిపోకండి.

Comment here!