Group 1/Group 2 Interview – ఎన్నికలు జరుగుతున్న5 రాష్ర్టాలు – విశేషాలు

2017 Elections 5 States Important points in Telugu, APPSC Group 1 Interview Preparation, TSPSC Group 1 Preparation, TSPSC Group 2 Preparation

ఎన్నికలు జరుగుతున్న5 రాష్ర్టాలు – విశేషాలు:

గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రిపేర్ అవ్వాల్సిన ఒక ముఖ్యమైన అంశం. ఈ 5 రాష్ట్రాల విశేషాలపై అభ్యర్థులను ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగేందుకు ఎంతో ఆస్కారం వుంది. కనుక ఈ 5 రాష్ట్రాల విశేషాలను మీకు అందిస్తున్నాము.

గోవా

  • రాజధాని: పనాజి
  • రాష్ట్ర ఏర్పాటు: 1987, మే 30
  • వైశాల్యం: 3702 చ.కి.మీ.
  • మొత్తం జిల్లాలు: 2
  • దేశం వైశాల్యంలో స్థానం: 29
  • జనాభా: 14,58,545
  • జనాభాలో స్థానం: 26
  • జనసాంద్రత: 394 చ.కి.మీ.
  • అక్షరాస్యత: 88.7 శాతం
  • ప్రధాన భాషలు: కొంకిణి, మరవి
  • లోక్‌సభ స్థానాలు: 2, రాజ్యసభ స్థానాలు: 1
  • అసెంబ్లీ స్థానాలు: 40
  • హైకోర్ట్ బెంచ్: ముంబై హైకోర్టులో
  • వైశాల్యంలో అతిచిన్న రాష్ట్రం, అతి తక్కువ తీరరేఖ గల రాష్ట్రం. 1961లో భారతదేశంలో విలీనమైంది (పోర్చుగీసువారి నుంచి).

పంజాబ్

  • రాజధాని: చండీగఢ్
  • రాష్ట్ర అవతరణ: 1966, నవంబర్ 1
  • మొత్తం జిల్లాలు: 22
  • వైశాల్యం: 50,362 చ.కి.మీ.
  • దేశ వైశాల్యంలో రాష్ట్రం: 20 స్థానంలో
  • మొత్తం జనాభా: 2,77,43,338
  • జనాభా పరంగా: 16వ స్థానం
  • జనసాంద్రత: 551 చ.కి.మీ.
  • అక్షరాస్యత: 75.8 శాతం
  • ప్రధాన భాష: పంజాబి
  • అసెంబ్లీ స్థానాలు: 117
  • లోక్‌సభ స్థానాలు: 13
  • రాజ్యసభ స్థానాలు: 1
  • దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన (1951లో) విధించిన, ఎక్కువ కాలం అమల్లో ఉన్న రాష్ట్రం పంజాబ్. షెడ్యూల్డ్ కులాలు ఎక్కువగా, ఎస్టీలు లేని రాష్ట్రం.

ఉత్తరప్రదేశ్

  • రాజధాని: లక్నో
  • రాష్ట్ర ఏర్పాటు: 1950, జనవరి 26
  • మొత్తం జిల్లాలు: 75
  • రాష్ట్ర వైశాల్యం: 2,43,286 చ.కి.మీ.
  • మొత్తం జనాభా: 19,98,12,341
  • దేశ వైశాల్యంలో స్థానం: 4
  • జనాభా పరంగా: 1వ స్థానం
  • జనసాంద్రత: 829 చ.కి.మీ.
  • అక్షరాస్యత: 67.7 శాతం
  • అసెంబ్లీ స్థానాలు: 403
  • విధానపరిషత్ సభ్యులు: 108
  • లోక్‌సభ స్థానాలు: 80
  • రాజ్యసభ స్థానాలు: 31
  • ప్రధాన భాషలు: హిందీ, ఉర్దూ
  • ఎక్కువ రాష్ర్టాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (మొత్తం 8 రాష్ర్టాలు). రాజ్యసభ, లోక్‌సభ, శాసనసభల సీట్లలో మొదటిస్థానంలో ఉంది.
  • ప్రపంచంలో అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫాం గోరఖ్‌పూర్‌లో ఉంది.
  • తొలి దళిత ముఖ్యమంత్రి (మాయావతి), తొలి మహిళా మంత్రి విజయలక్ష్మీ పండిట్, తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు, తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలాని, ఒకరోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగదాంబికా పాల్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.
  • జానపద నృత్యం: నేతంకి

మణిపూర్

  • రాజధాని: ఇంఫాల్
  • రాష్ట్ర ఏర్పాటు: 1972, జనవరి 21
  • మొత్తం జిల్లాలు: 9
  • వైశాల్యం: 22327 చ.కి.మీ.
  • వైశాల్యంలో స్థానం: 24
  • జనాభా: 25,70,390
  • జనాభా పరంగా: 24వ స్థానం
  • జనసాంద్రత: 115 చ.కి.మీ.
  • అక్షరాస్యత: 79.2 శాతం
  • ప్రధాన భాష: మణిపురి
  • లోక్‌సభ స్థానాలు: 2
  • రాజ్యసభ స్థానాలు: 1
  • అసెంబ్లీ స్థానాలు: 60
  • వజ్రాల భూమిగా మణిపూర్ ప్రసిద్ధి చెందింది. దీన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.

ఉత్తరాఖండ్

  • రాజధాని: డెహ్రాడూన్
  • రాష్ట్ర అవతరణ: 2000, నవంబర్ 9
  • మొత్తం జిల్లాలు: 13
  • రాష్ట్ర వైశాల్యం: 53484 చ.కి.మీ.
  • వైశాల్యంలో స్థానం: 19
  • మొత్తం జనాభా: 1,00,86,292
  • జనాభాలో స్థానం: 20
  • జనసాంద్రత: 189 చ.కి.మీ.
  • అక్షరాస్యత: 78.8 శాతం
  • లోక్‌సభ స్థానాలు: 5; రాజ్యసభ స్థానాలు: 3
  • అసెంబ్లీ స్థానాలు: 70
  • ప్రధాన భాషలు: హిందీ, గర్‌వాలి
  • దేశంలో మొదటి యోగా యూనివర్సిటీ హరిద్వార్‌లో ఏర్పాటైంది.

Comment here!