Role of Agriculture and Green Revolution in India Material in Telugu – భారత దేశంలో వ్యవసాయం

Indian Agriculture Material in Telugu for APPSC TSPSC Group -1, Group -2 and Group -3, Role of Agriculture and Green Revolution in India Material in Telugu, Role of Agriculture in Indian Economy

Role of Agriculture and Green Revolution in India  Material in Telugu – భారత దేశంలో వ్యవసాయం, హరిత విప్లవం పాత్ర

We have compiled all important aspects of Role of Agriculture and Green Revolution in India in Telugu for candidates preparing for UPSC, APPSC and TSPSC Group -1, Group -2 and Group -3 exams.

వ్యవసాయ రంగం ముఖ్యాంశాలు:

  • ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జంతువులు, మొక్కలను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయడాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు.
  • భారతదేశంలో కొత్త రాతియుగం (6000-1000 నవీనయుగం)లో మానవులు ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. వ్యవసాయం, పశుపోషణ చేపట్టారు.
  • సింధు లోయ నాగరికత ప్రాంతాలైన బానావలిలో టెర్రకోటతో తయారుచేసిన నాగలిబొమ్మ, కాళిబంగన్‌లో నాగలితో దున్నిన చాళ్లు, లోథాల్‌లో వరి గింజలు తవ్వకాల్లో బయటపడడం ఆ కాలంలోనే వ్యవసాయం చేశారనడానికి నిదర్శనం.
  • నదులకు వచ్చే వరదల వల్ల కొట్టుకు వచ్చే ఒండ్రుమట్టి ఉన్న భూముల్లో తృణధాన్యాలు, గోధుమలు, బార్లీ, బీన్స్ నూనె గింజలు, అవిసెలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి, ఆవాలు సింధు నాగరికత ప్రజలు ఆనాడు పండించిన ముఖ్య పంటలు.
  • వీటికి తోడు సింధులోయ ప్రజలే ప్రపంచంలో మొదటిసారిగా వరి, పత్తి పంటలను పండించారు.
  • ప్రస్తుతం ప్రపంచంలోని శ్రామికుల్లో 42 శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. అందువల్ల వ్యవసాయం ప్రపంచంలోనే అధిక శాతం ప్రజల వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5 శాతం మాత్రమే.
  • ఐక్యరాజ్య సమితి 2014ను అంతర్జాతీయ కుటుంబ సేద్య సంవత్సరంగా ప్రకటించినది.
  • ప్రతీ సంవత్సరం డిసెంబర్ 23 న రైతు దినోత్సవం జరుపుకుంటారు

దేశంలో వ్యవసాయం

  • దేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు.
  • ఖరీఫ్ పంట కాలం: జూన్ నుంచి అక్టోబర్ వరకు సాగ య్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్కజొన్న, పత్తి, చెరుకు, నూలు, సోయాబీన్, వేరుశనగ.
  • రబీ పంటకాలం: అక్టోబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు. గోధుమ, బార్లీ, మినుములు, పొద్దు తిరుగుడు, ధనియాలు, ఆవాలు మొదలైనవి.
  • జైద్ పంటకాలం: మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు. పుచ్చకాయలు, దోసకాయలు, కూరగాయలు మొదలైనవి.
  • పంటల రకాలు నాలుగు రకాలు. అవి:
  • ఆహార పంటలు: వరి, గోధుమ, మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, రాగులు, పప్పుధాన్యాలు. ఇవి రెండు రకాలు.
    1. ప్రధాన ధాన్యాలు : వరి, గోధుమ, మొక్కజొన్నలు.
    2. తృణ ధాన్యాలు : జొన్నలు, సజ్జలు, రాగులు.
  • వాణిజ్య పంటలు: పత్తి, పొగాకు, జనుము, చెరుకు, నూనె గింజలు.
  • తోట పంటలు: కాఫీ, తేయాకు, కొబ్బరి, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు.
  • ఉద్యాన పంటలు: పండ్లు, పూలు, కూరగాయలు.

మన దేశంలో వ్యవసాయరంగ ప్రాధాన్యం:

  • దేశంలో వ్యవసాయం రాష్ట్ర జాబితాలో(State List) పేర్కొనబడి ఉంది
  • వ్యవసాయదారుడు సాగు చేసే భూమిని వ్యవసాయ కమతం అంటారు. రాష్ట్రంలో సగటు భూకమతం 1.11 హెక్టార్లు. జాతీయ స్థాయిలో సగటు భూకమతం 1.15 హెక్టార్లు.
  • 2014-15 దేశ స్థూల జాతీయోత్పత్తిలో(GDP) వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 17.4 శాతంగా ఉంది
  • 2015-16 GDP లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వృద్ధి శాతం 1.1 శాతంగా ఉంది. 2014-15 లో -0.2 శాతం (రుణాత్మకం) గా వుంది. ఈ తక్కువ వృద్ధి రేటుకు ప్రధాన కారణం దేశంలోని వర్షాభావ పరిస్థితులు
  • మూలధన కల్పన (GCF – Gross Capital Formation)లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 2014-15 లో 8.6 శాతం, 2013-14లో 7.9 శాతం నమోదైంది.
  • వ్యవసాయం, దాని అనుబంధ రంగాల స్థూలదేశీయ ఆదాయం (జీడీపీ)లో స్థూల మూలధన కల్పనవాటా 2011-12లో 18.3 శాతం, 2013-14లో 14.8 శాతంగా ఉన్నది.
  • దేశ ఎగుమతుల్లో పది శాతం వ్యవసాయ ఉత్పత్తులే
  • ఆ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తులు 2015-16 సంవత్సరానికి గాను 253.2 మిలియన్ల టన్నులు
  • ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిలో భారతదేశ వాటా 7.68 శాతం
  • 2013-14లో వ్యవసాయ రంగంలో 54.6 శాతం మందికి ఉపాధి అవకాశం లభించింది.
  • 12వ ప్రణాళికలో (2012-17) వ్యవసాయ రంగవృద్ధి రేటు 4 శాతంగా నిర్ణయించారు.
  • 1990-91లో 1205.86 కోట్ల మొత్తం దిగుమతులు జరిగాయి. భారతదేశం దిగుమతి చేసుకున్న దిగుమతుల్లో వ్యవసాయ దిగుమతుల శాతం 2.79 శాత్రం మాత్రమే
  • 1990-91లో 6012.76 కోట్లు మొత్తం ఎగుమతులు జరిగాయి. భారతదేశం చేసిన ఎగుమతుల్లో వ్యవసాయ ఎగుమతుల శాతం 18.49 శాతం.
  • 2013-14 (P)లో 105149.00 కోట్లు మొత్తం దిగుమతులు జరిగాయి. భారతదేశం చేసుకొన్న దిగుమతుల్లో వ్యవసాయ దిగుమతుల శాతం 3.87 శాతం మాత్రమే.
  • 2013-14 (P)లో 2,68,469.05 కోట్ల మొత్తం ఎగుమతులు జరిగాయి. భారతదేశం ఎగుమతి చేసిన ఎగుమతుల్లో వ్యవసాయ ఎగుమతుల శాతం 14.17 శాతం.
  • ప్రపంచంలో అత్యధిక శాతం భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్న మూడో దేశం భారతదేశం. ఇక్కడ వ్యవసాయ భూమి 15,83,20,000 హెక్టార్లు. మొత్తం భూమిలో వ్యవసాయ భూమి శాతం 48.15 శాతం వ్యవసాయానికి వినియోగిస్తున్నారు.
  • ప్రపంచంలో అత్యధిక శాతం భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్న దేశం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్‌లో వ్యవసాయ భూమి 1,06,75,100 హెక్టార్లు . మొత్తం భూమిలో శాతం 68.6 శాతం వ్యవసాయానికి వినియోగిస్తున్నారు
  • ప్రపంచంలో అత్యధిక శాతం భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్న రెండో దేశం ఉక్రెయిన్. మొత్తం భూమిలో 55.3 శాతం వ్యవసాయానికి వినియోగిస్తున్నారు.
  • వ్యవసాయదారుడు సేద్యం చేసే భూమిని కమతం అంటారు. జాతీయ స్థాయిలో సగటు కమతం 1.15 హెక్టార్లు (2011 వ్యవసాయ లెక్కల ప్రకారం)
  • దేశంలో హెక్టార్ కన్నా తక్కువ భూమి వున్న వారు 67.1 శాతంగా ఉన్నారు
  • 1971-72లో వ్యవసాయ భూమి 119.636 మిలియన్ల హెక్టార్లు ఉంటే, 2013 నాటికి 92.359 హెక్టార్లుగా మిగిలినది. నాలుగు దశాబ్దల కాలంలో వ్యవసాయ భూమి 22.7 శాతం తగ్గినది.
  • దేశంలో భూమి లేని కుటుంబాల జాతీయ సగటు 7.41 శాతం
  • 2001లో సేద్యం చేసే వారి సంఖ్య 10 కోట్ల 30 లక్షలు ఉంటే, 2011 నాటికి తొమ్మిదిన్నర కోట్లకు తగ్గింది.
  • రోజుకు రెండు వేలకు పైగా సేద్యానికి దూరమై పోతున్నారు.

2016-17 , 2015-16 Agricultural Statistics in India, Role of Agriculture and Green Revolution in India Material in Telugu

 

వ్యవసాయ అనుబంధ రంగాలు:

  • ప్రపంచంలో అత్యధిక పశుసంపద గల దేశం భారతదేశం
  • 2014-15లో ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్‌ది ప్రథమస్థానం. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 18.5 శాతం. మన దేశంలో పాల ఉత్పత్తి 146.3 టన్నులు. ప్రస్తుతం తలసరి పాల లభ్యత 322 గ్రాములు.
  • 2014-15లో మనదేశంలో గుడ్ల ఉత్పత్తి 78.48 బిలియన్లు, పౌల్ట్రీ మాంసం ఉత్పత్తి 3.04 మిలియన్ టన్నులు
  • స్థూల దేశీయోత్పత్తిలో మత్స్య సంపద వాటా 1 శాతం. వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూలదేశీయ ఉత్పత్తిలో మత్స్య సంపద వాటా 5.08 శాతం.
  • 1950-51లో సముద్ర చేపలు 5,34,000 టన్నులు, దేశీయ జలాల్లో 2,18,000 టన్నులు మొత్తం 7,52,000 టన్నుల చేపలు దొరికాయి.
  • 2012-13లో సముద్ర చేపలు 33,21,000 టన్నులు, దేశీయ జలాల్లో 57,20,000 టన్నులు మొత్తం 90,40,000 టన్నుల చేపలు దొరికాయి.

నీటి పారుదల రంగం:

  • నీటి పారుదల విస్తీర్ణాన్ని బట్టి నీటి పారుదల ప్రాజెక్టును మూడు రకాలుగా విభజించారు. 1950-51లో వ్యయాన్ని అనుసరించి మూడు రకాలుగా 1978లో నీటిపారుదల అనుసరించి ప్రాజెక్టుల వర్గీకరణ చేశారు.
  • భారీ నీటి పారుదల ప్రాజెక్టు: 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ నీటి పారుదల సౌకర్యాలున్న ప్రాజెక్టును భారీ నీటి పారుదల ప్రాజెక్టు అంటారు. ఐదు కోట్ల వ్యయానికి పైగా ఖర్చు అవుతుంది.
  • మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టు: 2,000 నుంచి 10,000 హెక్టార్లకు నీటి పారుదల సౌకర్యాలున్న ప్రాజెక్టును మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు అంటారు. 10 లక్షల నుంచి 5 కోట్లకుపైగా వ్యయమవుతాయి.
  • చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టు: 2,000 హెక్టార్లలోపు నీటి పారుదల సౌకర్యాలున్న ప్రాజెక్టును చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టు అంటారు. 10 లక్షల వ్యయంలోపు ఉన్న ప్రాజెక్టులు

Irrigation Sources in India, Agriculture Material for TSPSC APPSC Group -1, Group -2 and Group -3

  • బావుల ద్వారా ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా సేద్యం చేస్తున్నారు.
  • బావులు రెండు రకాలు. గొట్టపు బావులు, మామూలు బావులు. గొట్టపు బావుల ద్వారా ఉత్తరప్రదేశ్‌లో, మామూలు బావుల ద్వారా పంజాబ్‌లో అత్యధికంగా సేద్యం చేస్తున్నారు .
  • కాలువల ద్వారా ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా సేద్యం చేస్తున్నారు. కాలువలు రెండు రకాలు. వరద కాలువలు, జీవ, లేదా నది కాలువలు, వరద కాలువల ద్వారా పంజాబ్‌లో అత్యధికంగా సేద్యం చేస్తున్నారు.
  • చెరువుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో (ఉమ్మడి రాష్ట్రంలో) అత్యధికంగా సేద్యం చేస్తున్నారు.
  • భారతదేశంలో నీటి పారుదల సాంద్రత అత్యధికంగా పంజాబ్‌లో, అత్యల్పంగా మిజోరాంలో ఉంది.
  • దేశంలో సాగు నీటి సదుపాయం ఉన్న వ్యవసాయ భూమి 42 శాతం. మొత్తం పంట ఉత్పత్తిలో, 56 శాతం ఇక్కడి నుంచే వస్తున్నది.
  • వర్షాధార పంట భూమి 58 శాతం. దీన్ని నుంచి వచ్చే పంట ఉత్పత్తి 44 శాతం.
  • పంటల సాంద్రత : పంటలు వేసిన స్థూల విస్తీర్ణాన్ని పంటలు వేసిన నికర విస్తీర్ణంతో భాగించగా వచ్చినది పంటల సాంద్రత
  • దేశంలో భూవినియోగం కింది విధంగా వుంది

Land Utilisation in India, Agriculture Material in Telugu for APPSC TSPSC Group -1, Group -2 and Group -3, Role of Agriculture and Green Revolution in India Material in Telugu

Land Holdings in India, Agriculture Material in Telugu for APPSC TSPSC Group 1, Group 2 and Group 3

 

  • సాగు భూమి పరంగా ప్రపంచంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు 1.అమెరికా – 16,69,30,200 హెక్టార్లు – 18.22% (మొత్తం భూమిలో శాతం)
    2.భారత్ – 15,83,20,000 హెక్టార్లు – 48.15% (మొత్తం భూమిలో శాతం)
    3.చైనా – 15,04,35,000 హెక్టార్లు – 16.13% (మొత్తం భూమిలో శాతం)
    4.రష్యా 11,92,30,000 హెక్టార్లు – 7.28% (మొత్తం భూమిలో శాతం)
    5.బ్రెజిల్ 6,61,29,900 హెక్టార్లు – 7.82% (మొత్తం భూమిలో శాతం)

 

2 thoughts on “Role of Agriculture and Green Revolution in India Material in Telugu – భారత దేశంలో వ్యవసాయం”

  1. Please upload liberalisation, globalization,privatisation and economic disparities between regions and population categories concepts….
    Those are for group2 screening test

Comment here!