Important Points in Pre-independence Indian Economy in Telugu

IMPORTANT POINTS IN PRE-INDEPENDENCE INDIAN ECONOMY IN TELUGU for APPSC Group 2 Screening Test

Important Points in Pre-independence Indian Economy in Telugu- స్వాతంత్ర్య పూర్వ భారత ఆర్ధిక వ్యవస్థలోని ముఖ్యాంశాలు:

We have compiled important points in Pre-independence Indian Economy- in Telugu for APPSC Group -2 Screening Test.

స్వాతంత్రానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ:

  • ప్లాసీ యుద్ధం 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ నవాబ్ ల మధ్య జరిగింది

  • బక్సార్ యుద్ధం 1764లో జరిగింది

  • 1765లో ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ హక్కులు లభించాయి.

  • భూమి శిస్తు వసూలు చేసే అధికారాన్నే దివానీ అని అంటారు. బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ లభించింది.

  • ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి వర్తక స్థావరాన్ని సూరత్ లో 1619లో ఏర్పాటు చేసారు

  • 1600 డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంగ్లాండ్ రాణి మొదటి ఎలిజబెత్ రాయల్ చార్టర్ ను భారత్, చైనాలలో వర్తకాన్ని జరిపేందుకు ఇచ్చింది

  • 1772 లో శిస్తు వ్యవసాయం (Revenue Farming) పద్ధతిని వారెన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టాడు

  • జమిందారీ వ్యవస్థను (Permanent Settlement) ను 1793లో కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు

  • 1792లో అలెక్సాండర్ రీడ్ రైత్వారీ వ్యవస్థను మద్రాస్ ప్రావిన్సులో ప్రవేశపెట్టాడు

  • 1822 లో ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో మహల్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు

  • 1813 చార్టర్ చట్టం భారత దేశ వర్తకంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏకస్వామ్యాన్ని(Monopoly) రద్దు చేసింది.

  • వాణిజ్య పంటలు పండించే పద్ధతి బ్రిటిషువారి కాలంలోనే అధికమయింది

  • 1943 లో బెంగాల్లో తీవ్రమైన కరువు ఏర్పడింది.

  • 1853లో లార్డ్ డల్హౌసి దేశంలో మొదటి రైల్వే లైనును బొంబాయి, థానే ల మధ్య ప్రారంభించాడు

  • మొదటిసారిగా దేశ జాతీయాదాయాన్ని లెక్కించింది దాదాభాయినౌరోజి 1867-68 లో. ఆనాటి జాతీయ ఆదాయం 340 కోట్లు. తలసరి ఆదాయం 20 రూపాయలు

  • మొదటి గవర్నర్ జనరల్ అఫ్ బెంగాల్ – వారెన్ హేస్టింగ్స్

  • మొదటి గవర్నర్ జనరల్ అఫ్ ఇండియా – విలియం బెంటింక్

  • పావర్టీ అండ్ అన్-బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది దాదాభాయినౌరోజి

  • ఇంగ్లండ్స్ వర్క్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది w హంటర్

  • 1881లో మొదటి సారిగా జనాభా లెక్కలు (Census) ప్రారంభమయ్యాయి

  • 1881లో జనాభాలో వ్యవసాయంపై 61 శాతం ప్రజలు ఆధారపడి వుండగా, 1921 లో ఇది 73 శాతానికి పెరిగింది

  • డ్రెయిన్ అఫ్ వెల్త్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది దాదాభాయినౌరోజి

  • 1857 తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్

  • మొదటి వైస్రాయ్ అఫ్ ఇండియా – లార్డ్ కానింగ్

  • మొదటి ఫ్యాక్టరీ చట్టాన్ని 1881లో తీసుకువచ్చారు

  • డెక్కన్ అల్లర్లు 1874లో జరిగాయి

  • భారతదేశ ఆర్ధిక చరిత్ర (ది Economic History అఫ్ India) అను పుస్తకాన్ని రచించింది రమేశ్ చంద్ర దత్

  • మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు (వస్త్ర పరిశ్రమ)ను కావస్జీ నానాబాయి 1853లో బొంబాయిలో స్థాపించారు

  • మొట్టమొదటి జనపనార పరిశ్రమ (Jute Mill)ను 1855 లో రిశ్రా (బెంగాల్)లో స్థాపించారు

 

3 thoughts on “Important Points in Pre-independence Indian Economy in Telugu”

Comment here!