Indian Polity in Telugu-Schedules-షెడ్యూల్స్

Indian Polity Material in Telugu for UPSC APPSC TSPSC Group 1 Group 2 and Group 3, Indian Constitution Material in Telugu, Fundamental Duties in Telugu, Union Government Telugu, Center-State Relations in Telugu

Indian Polity in Telugu- Schedules-షెడ్యూల్స్

భారత రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఒక్కో షెడ్యూల్ ఒక్కో అంశాన్ని గురించి తెలియచేస్తుంది. పాత సివిల్స్ ప్రిలిమ్స్, గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3 ప్రశ్నాపత్రాల ఆధారంగా పరిశీలిస్తే ప్రతీ సంవత్సరం కనీసం ఒకటి లేదా రెండు ప్రశ్నలైనా డైరెక్ట్ గా ఈ షెడ్యూల్స్ నుంచి అడగబడుతున్నాయి. కనుక, ఈ పన్నెండు షెడ్యూల్స్ ను గుర్తుంచుకున్నట్లయితే, ఈ ఒకటి రెండు మార్కులను పరీక్షల్లో చేజార్జుకోకుండా ఉండవచ్చు

షెడ్యూల్

తెలియజేసే అంశం

ఒకటవ షెడ్యూల్

రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితా

రెండవ షెడ్యూల్

రాష్ట్రపతి,, గవర్నర్లు, సుప్రీం కోర్టు మరియు హై కోర్టు న్యాయమూర్తులు, కాగ్(CAG) వేతనాలు

మూడవ షెడ్యూల్

వివిధ రాజ్యాంగబద్ధ పదవుల ప్రమాణాలు

నాలుగవ షెడ్యూల్

రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల పంపిణీ

ఐదవ షెడ్యూల్

షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన, నియంత్రణ

ఆరవ షెడ్యూల్

అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం ప్రత్యేక నిబంధనలు (AMTM)

ఏడవ షెడ్యూల్

కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలు, విధుల పంపిణీ

కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉభయ జాబితా

ఎనిమిదవ షెడ్యూల్

రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు

తొమ్మిదవ షెడ్యూల్

1951 లో తొలి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. వివిధ రాష్ట్రాల భూ సంస్కరణ చట్టాలను న్యాయ సమీక్ష పరిధిలోకి రాకుండా ఈ షెడ్యూల్ ను చేర్చారు

పదవ షెడ్యూల్

1985 లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది ఫిరాయింపులను నిరోధించడానికి నిబంధనలు ఇందులో చేర్చారు

పదకొండవ షెడ్యూల్

1992 లో 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ నిబంధనలను ఇందులో చేర్చారు.

పన్నెండవ షెడ్యూల్

1992 లో 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా మునిసిపాలిటీల నిబంధనలను ఇందులో చేర్చారు.

 

Comment here!