Mission Bhageeratha Important Points – మిషన్ భగీరథ ముఖ్యాంశాలు

Mission Bhageeratha in Telugu, Mission Bhageeratha Important Points

Mission Bhageeratha Important Points – మిషన్ భగీరథ ముఖ్యాంశాలు:

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ సురక్షిత మంచినీటిని ప్రతీ రోజు చాలినన్ని అందించాలని, కరువు కాటకాలు సంభవించినా, భూగర్భజలాలు అడుగంటినా సరే ఇంటికి మంచినీరు వచ్చి తీరాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్‌ భగీరథ’ కార్యక్రమం చేపట్టారు. అటు కృష్ణ, ఇటు గోదావరి నదుల నుంచి నీళ్లను చిలుంపట్టని పైపుల ద్వారా తెచ్చి ప్రతీ గ్రామంలో సరఫరా చేసే బృహత్తర కార్యక్రమం ఇది. నదుల నీళ్లను వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు చేర్చి అక్కడ శుద్ధి చేసి నీటిని గ్రామాలకు పంపుతారు.గ్రామాల్లోని ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తారు. వచ్చే 30 ఏళ్ల వరకుండే జనాభాను అంచనా వేసి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేశారు. అప్పటి వరకు మంచినీటి సమస్య లేకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టును 26 సెగ్మెంట్లుగా విభజించి సమాంతరంగా పనులు చేస్తున్నారు. రూ.42,853 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్నారు.

మిషన్‌ భగీరథ లక్ష్యాలు

 • రాష్ట్రంలోని 25వేల నివాస ప్రాంతాలకు నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందించడం.
 • 2018 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి
 • 2016 ఆగస్టులో మొదటి దశ ప్రారంభం
 • 2016 డిసెంబర్‌ నాటికి 6 వేల గ్రామాలకు మంచినీరు అందించడం.
 • 2017 డిసెంబర్‌ నాటికి 90 శాతం గ్రామాలకు మంచినీరు ఇవ్వడం
 • గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి ప్రతీ రోజు 100 లీటర్ల మంచినీరు అందాలి
 • మున్సిపాలిటీలు/నగర పంచాయితీల్లో ప్రతీ ఇంటికి ప్రతీ రోజు 135 లీటర్ల మంచినీరు అందాలి
 • మున్సిపల్‌ కార్పోరేషన్లలో ప్రతీ ఇంటికి ప్రతీ రోజు 150 లీటర్ల మంచినీరు అందాలి
 • మిషన్‌ భగీరథ పైపులైన్ల ద్వారానే పరిశ్రమలకు ప్రాజెక్టుల్లోని 10 శాతం నీరు సరఫరా చేయాలి
 • ప్రతీ నీటిపారుదల ప్రాజెక్టులోని రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మిషన్‌ భగీరథకు వాడుకోవాలి

మిషన్‌ భగీరథకు ఆధారాలు:

 • 365 రోజులూ మంచినీళ్లు అందించడం కోసం ఎప్పుడూ ఎండిపోని ప్రాంతాల నుంచి నీటిని తరలిస్తారు.
 • కృష్ణ, గోదావరి బేసిన్ల నుంచి 4.27 టింఎంసిల నీటిని వాడుతారు.
 • కృష్ణ బేసిన్లోని శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌, కృష్ణా నది, టేల్‌ పాండ్‌, పాలేరు నుంచి 19.65 టిఎంసిల నీటిని వాడతారు
 • గోదావరి బేసిన్లోని సింగూరు డ్యామ్‌, ఎల్‌ఎండి, ఎంఎండి, గోదావరి నది, ఎస్‌ఆర్‌ఎస్పీ, కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి, కొమురంభీమ్‌ ప్రాజెక్టుల నుంచి 19.62 టిఎంసిల నీటిని వాడతారు.
 • హైదరాబాద్‌ కు మంచినీరు సరఫరా చేసే ఎల్లంపల్లి లైన్‌ నుంచి 3 టిఎంసిల నీరు వాడతారు.
 • ప్రభుత్వం, ప్రైవేటు భూముల నుంచి మంచినీటి పైప్‌ లైన్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రైట్‌ ఆఫ్‌ వే చట్టాన్ని తెచ్చింది.

మిషన్‌ భగీరథ ముఖ్యాంశాలు

 • సెగ్మెంట్లు : 26
 • నియోజకవర్గాలు: 99
 • మండలాలు: 437
 • కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు/
 • నగర పంచాయితీలు: 63
 • ఆవాస ప్రాంతాలు : 24,224
 • గ్రామీణ కుటుంబాలు: 49,19,007
 • ఇన్‌ టేక్‌ స్ట్రక్చర్స్‌: 17
 • ట్రాన్స్‌ మిషన్‌ లైన్స్‌: 49,260 కిలోమీటర్లు
 • డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌ వర్క్‌: 40,605 కిలోమీటర్లు (ప్రస్తుతం ఉన్నవి) :40,303 కి.మీ (కొత్తవి)
 • పైప్‌ లైన్‌ నెట్‌ వర్క్‌: 1,30,168 కిలోమీటర్లు
 • ఓహెచ్‌ఎస్‌ఆర్‌ లు: 17,066 15.34
 • లక్షల లీటర్ల సామర్థ్యం (ప్రస్తుతం ఉన్నవి): 18,507
 • 10.75 లక్షల లీటర్ల సామర్థ్యం (కొత్తవి)
 • వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌:
 • 60 (804 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం)
 • ప్రస్తుతం ఉన్నవి: 50 (3311 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం) కొత్తవి

Comment here!