Telangana New Districts History, Details- తెలంగాణా కొత్త జిల్లాలు – చరిత్ర, విశేషాలు

Telangana New Districts History, Telangana New Districts Details, Telangana 31 Districts Map, Telangana Geography

Telangana New Districts History, Details and Important Points- తెలంగాణా కొత్త జిల్లాలు – చరిత్ర, విశేషాలు, పూర్తి సమాచారం

2016 లో దసరా రోజున తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం మారిపోయింది. అక్టోబర్ 11 న కొత్తగా 21 జిల్లాలు ఏర్పడడంతో, తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 31 కి చేరింది. పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రంలో కూడా మూడుసార్లు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. తెలంగాణా రాష్ట్రం ఈ ప్రాంతంలోనిదే కనుక మార్పు తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. ఒకమార్పునుంచే మార్పును ఆహ్వానిస్తుంది. యీ మార్పులు పరిపాలనా సౌకర్యంకోసం అవసరమవుతాయి.

తెలంగాణలోని ఈ జిల్లాల చరిత్ర, విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Telangana New Districts History, Telangana New Districts Details, Telangana 31 Districts Map

మొత్తం జిల్లాలు: 31
విస్తీర్ణం: 1,12,077 చ.కి.మీ.
జనాభా: 3,50,03,674
అక్షరాస్యత: 66.46

మండలాల సంఖ్య: 584
రెవెన్యూ డివిజన్లు: 68
రెవెన్యూ గ్రామాలు: 10,966

విశేషాలు

 • రాష్ట్రంలో సగటున జిల్లాల విస్తీర్ణం 3,704 చ.కి.మీ.

 • జనాభాపరంగా దేశంలో తెలంగాణ రాష్ర్టానికి 12వ స్థానం, వైశాల్యంలో కూడా 12వ స్థానం. జిల్లాల సంఖ్యపరంగా 9వ స్థానంలో ఉంది.

 • రాష్ట్రంలో 5 నుంచి 10 లక్షల జనాభాగల జిల్లాలు 19 ఉన్నాయి. పది నుంచి పదిహేను లక్షల జనాభాగల జిల్లాలు 6, పదిహేను నుంచి ఇరవై లక్షల జనాభాగల జిల్లాలు 3, ఇరవై లక్షల జనాభా పైబడిన జిల్లాలు 3 ఉన్నాయి.

 • రాష్ట్రంలో 6 మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. అవి.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్.

 • రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 20 జిల్లాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక సరిహద్దులతో ఉన్నాయి.

 • కర్ణాటక సరిహద్దుగల జిల్లాలు 6. అవి.. మహబూబ్‌నగర్, వికారాబాద్, గద్వాల, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి.

 • ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగల జిల్లాలు 6. అవి.. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, గద్వాల, కొత్తగూడెం.

 • మహారాష్ట్రతో సరిహద్దుగల జిల్లాలు 5. అవి.. భూపాలపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, కామారెడ్డి.

 • ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దుగల జిల్లాలు 3. అవి.. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల.

 • అత్యధిక జిల్లాలు వరంగల్ (5) నుంచి ఏర్పడ్డాయి.

 • విభజనకు గురికాని జిల్లా హైదరాబాద్.

 • అతిపెద్ద జిల్లా: భద్రాద్రి-కొత్తగూడెం (8,062 చ.కి.మీ.)

 • అతిచిన్న జిల్లా: హైదరాబాద్ (217 చ.కి.మీ.)

 • ఎక్కువ మండలాలు ఉన్న జిల్లా: నల్లగొండ (31)

 • తక్కువ మండలాలున్న జిల్లా: వరంగల్ అర్బన్ (11)

 • రెవెన్యూ డివిజన్లు ఎక్కువ ఉన్న జిల్లా: రంగారెడ్డి (11)

 • తక్కువ రెవెన్యూ డివిజన్లు ఉన్న జిల్లాలు: రాజన్న సిరిసిల్ల, వనపర్తి, జోగులాంబ గద్వాల, వరంగల్ అర్బన్

 • అత్యధిక గ్రామాలున్న జిల్లా: సంగారెడ్డి (600)

 • అతితక్కువ గ్రామాలున్న జిల్లా: హైదరాబాద్ (100)

 • అత్యధిక జనాభాగల జిల్లా: హైదరాబాద్ (39,43,323)

 • తక్కువ జనాభా ఉన్న జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా (5,43,694)

 • అత్యధిక జనాభాగల మండలం: బహదూర్‌పుర (4,68,158)

 • అత్యధిక జనాభాగల రెండో మండలం: ఖమ్మం అర్బన్

 • తక్కువ జనాభా ఉన్న మండలం: గంగారం (10,780)- మహబూబాబాద్ జిల్లా

 • ఎక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా: హైదరాబాద్ (83 శాతం)

 • తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్న జిల్లా: కామారెడ్డి (48.49 శాతం)

జిల్లాల చరిత్ర:

రంగారెడ్డి

పూర్వం ఈ జిల్లాను అత్రాఫ్‌బల్దా జిల్లా అనేవారు. బల్దా అంటే నగరం అత్రాఫ్‌ అంటే చుట్టూ వున్న ప్రాంతం. ఈ జిల్లాలో 876 గ్రామాలుండేవి. 573 గ్రామాలు సర్ఫెఖాస్‌ (నిజాం స్వంత ఆస్తి) భాగం, కాగా జాగీరు గ్రామాలు 303 ఉండేవి. అత్రాఫ్‌ బల్దా జిల్లాలో దివానీ (ప్రభుత్వ) గ్రామాలు లేవు. దివానీ గ్రామాలను పరిసర మెదక్‌ జిల్లాలోని బాగాత్‌ జిల్లాలో కలిపివేశారు.

హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైపోగానే ఈ జిల్లాలోని సర్ఫెఖాస్‌ గ్రామాలను, జాగీరు గ్రామాలను, దివానీ గ్రామాలను ఒకే చోట కలిపి 1948లో హైదరాబాద్‌ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ జిల్లాలో హైదరాబాదు తూర్పు, హైదరాబాదు పశ్చిమ, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌, షాబాద్‌, తాలూకాలు ఉండేవి. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పరిగి, మెదక్‌ జిల్లాలోని వికారాబాద్‌, గుల్బర్గా జిల్లాలోని తాండూరు దీనిలో కలిసిపోయాయి. 1965 ఏప్రిల్‌లో మేడ్చల్‌, హైదరాబాద్‌ తూర్పు, హైదరాబాద్‌ పశ్చిమ తాలూకాలోని నగరాన్ని ఆనుకొని ఉన్న కొన్ని గ్రామాలతో హైదరాబాద్‌ అర్బన్‌ తాలూకా ఏర్పడింది. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు. ఈ జిల్లా కార్యాలయాలన్నీ హైదరాబాద్‌ నగరంలోనే ఉన్నాయి.

జిల్లాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు. అవి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్

మహబూబ్‌నగర్‌

ప్రస్తుతం మహబూబ్‌నగరుగా ఉన్న పట్టణ ప్రాంతం 17వ శతాబ్దంలో లోకాయెపల్లి సంస్థానంలోని పాలమూరు పేరుతో ఉండేది. సంస్థాన అధికారులు దీన్ని అభివృద్ధి పరిచి 6వ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌పేర మహబూబ్‌నగర్‌ అని పెట్టుకున్నారు. 1904లో జిల్లా కేంద్రాన్ని నాగర్‌కర్నూలునుంచి మహబూబ్‌నగర్‌కు మార్చారు.

జాగీర్లను విలీనపరిచినప్పుడు అంటే 1950కి ముందు కల్వకుర్తి, పరిగి, నాగర్‌కర్నూలు, మక్తల్‌, అచ్చంపేట అనే 6 తాలూకాలు ఉండేవి. జాగీర్ల విలీనం కారణంగా వనపర్తి, షాద్‌నగర్‌, కొల్లాపూర్‌, ఆత్మకూరు తాలూకాలు దీనిలో కలిసిపోయి పది తాలూకాల జిల్లా అయింది. రాష్ట్రాల పునర్నిర్మాణ సమయంలో మూడవసారి మార్పుతో మరో మూడు తాలూకాలు-రాయచూరు జిల్లానుంచి గద్వాల, ఆలంపూరు తాలూకాలు, గుల్బర్గానుంచి కొడంగల్‌ తాలూకా దీనిలో చేరాయి. పరిగి తాలూకాను హైదరాబాద్‌ జిల్లాలో కలిపారు. దీనితో ఈ జిల్లాలో తాలూకాల సంఖ్య 12 అయింది. హైదరాబాద్‌ రాష్ట్రంలోని సగం సంస్థానాలు యీ జిల్లాలో ఉండడంవలన అభివృద్ధిలో ఈ జిల్లా కొంత వెనుకబడి ఉంది.

జిల్లాల పునర్విభజనలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా గా విభజించారు. అవి మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్

నల్లగొండ

విప్లవాల పుట్టిల్లుగా ప్రసిద్ధి చెందిన నల్లగొండకు నీలగిరి అని పేరుండేది. రెండు నల్లరాతి కొండల మధ్య ఉండడంవల్ల నల్లగొండ అనే పేరువచ్చి ఉంటుంది. 1901 నాటికి ఈ జిల్లా నల్లగొండ, సూర్యాపేట, దేవరకొండ, భువనగిరి తాలూకాలు, కొన్ని జాగీరు గ్రామాలతో కలిసి ఉండేది. 1905లో వరంగల్లు జిల్లానుండి కోదాడ, చీరాల ఫిర్కాలను ఈ జిల్లాలో కలిపి పోచంచర్ల తాలూకా (ప్రస్తుతం హుజూర్‌నగర్‌)ను ఏర్పాటు చేశారు. 1901-1951 మధ్య అయిదు దశాబ్దాల కాలంలో జిల్లాలో పెద్ద మార్పులు లేవు. ఐతే 1953లో ఖమ్మంజిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు ఈ జిల్లాలోని జనగామ తాలూకాను వరంగల్‌జిల్లాలో చేర్చారు. 1959లో ఈ జిల్లా భూభాగంలోనికి చొచ్చుకొని ఉన్న కృష్ణాజిల్లాలోని మునగాల పరగణాను యీ జిల్లాలో కలిపారు.

జిల్లాల పునర్విభజనలో భాగంగా నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు. అవి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి

నిజామాబాద్‌

పూర్వం ఇందూరుగా పేరున్న జిల్లా నిజామాబాద్‌గా మారింది. ఇంద్రపురి ఇందూరు అయిందంటారు. 1878లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి సాలార్‌జంగ్‌ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిపినప్పుడు ఇందూరు ఈ జిల్లా కేంద్రమైంది. 1905లో జిల్లాల పునర్నిర్మాణం జరిగినప్పుడు ఇందూరు జిల్లాను మెదక్‌ సుబాలో చేర్చి నిజామాబాద్‌ పేరు పెట్టారు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో నాందేడ్‌జిల్లా దెగ్లూర్‌ తాలూకాలోని బిచ్‌కుంద, జుక్కల్‌ సర్కిల్‌ ఈ జిల్లాలోని బాన్సువాడ తాలూకాలో కలిపివేశారు.

జిల్లాల పునర్విభజనలో భాగంగా నిజామాబాద్‌ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించారు. అవి నిజామాబాద్‌, కామారెడ్డి

కరీంనగర్‌

1905కి పూర్వం కరీంనగర్‌ జిల్లా కేంద్రం స్థానం ఎల్గందల్‌లోఉండేది. ఎల్గందల్‌ గ్రామం కరీంనగర్‌కు సమీపంలో ఉంది. బమ్మెర పోతన రచించిన భాగవత గ్రంథంలోని నశించిపోయిన కొన్ని భాగాలను పూరించిన వెలిగందల నారయ ఈ ప్రాంతంవాడే. జాగీర్లు రద్దయినప్పుడు మెట్‌పల్లిని ఎనిమిదవ తాలూకాగా చేశారు. ఖమ్మం జిల్లా ఏర్పడినప్పుడు ఈ జిల్లాలోని పర్కాల తాలూకాను వరంగల్‌ జిల్లాకు మార్చారు. మహాదేవపూర్‌ మంథనిగానూ, జమ్మికుంట హుజూరాబాద్‌గా పేర్లు మార్పు చెందాయి.

జిల్లాల పునర్విభజనలో భాగంగా కరీంనగర్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. అవి కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి

ఆదిలాబాద్‌

పూర్వపు ఆదిలాబాద్‌ జిల్లా పరిపాలన సౌలభ్యంకోసం ఏర్పడిన జిల్లానేగాని చారిత్రకంగా, భౌగోళికంగా ప్రాముఖ్యమైనది కాదు. 1905లో ఈ జిల్లా సిర్పూరు-తాండూరు పేరుతో బీదర్‌ డివిజన్‌లో భాగంగా ఉండి, కొన్ని జాగీరు గ్రామాలను, కరీంనగర్‌ జిల్లాలోని చెన్నూరు, లక్సెట్టిపేట తాలూకాలు, నిజామాబాద్‌ జిల్లాలోని నర్సాపురం, నిర్మల్‌ తాలూకాలు, ఆదిలాబాద్‌ తాలూకాను విభజించి కిన్వట్‌ తాలూకాగా ఏర్పాటు చేశారు. 1911-1921 మధ్యకాలంలో ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ల పునర్విభజన జరిగి ఉట్నూరు, బోధ్‌ తాలూకాలు ఏర్పడ్డాయి. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఈ జిల్లాలో మరాఠీ మాట్లాడే ప్రజలున్న రాజూరా, కిన్వట్‌ లను మహారాష్ట్రకు బదిలీచేసి, నాందేడుజిల్లా ముధోల్‌ను ఆదిలాబాద్‌జిల్లాలో కలిపారు.

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. అవి ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, కుంరం భీం ఆసిఫాబాద్

వరంగల్‌

ఓరుగల్లుగా ప్రసిద్ధి చెందిన వరంగల్పె జిల్లా పెద్ద తటాకాలతో, గుళ్ళు, గోపురాలతో, చారిత్రక ప్రాధాన్యంగల శిల్పాలతో, కాకతీయ వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. నాటి హైదరాబాద్‌ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ఉన్న ఈ జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యంగా విభజించి ఖమ్మంజిల్లాను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక, విద్యారంగాలలో తెలంగాణరాష్ట్రంలో వరంగల్ నగరం రెండవ స్థానంలో ఉంది.

జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించారు. అవి వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ

ఖమ్మం

పరిపాలనా సౌలభ్యంకోసం వరంగల్‌ జిల్లానుంచి 1953లో విడివడి ఖమ్మంజిల్లా కొత్తగా ఏర్పడింది. ఖమ్మం జిల్లా ఐదు తాలూకాలు ఖమ్మం, ఇల్లెందు, మధిర, బూర్గంపాడు, పాల్వంచ (ప్రస్తుతం కొత్తగూడెం) ఉన్నాయి. 1959లో తూర్పు గోదావరిజిల్లాలోని భద్రాచలం, సూగూరు తాలూకాలను ఖమ్మంలో కలిపారు. కొత్తగూడెం, మధిర తాలూకాలోని కొన్ని గ్రామాలతో 1974 ఫిబ్రవరిలో సత్తుపల్లి తాలూకాను ఏర్పాటు చేశారు.

జిల్లాల పునర్విభజనలో భాగంగా ఖమ్మం జిల్లాను రెండు జిల్లాలుగా విభజించారు. అవి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం

మెదక్‌

ఈ జిల్లా చిన్నదే అయినా చారిత్రకంగా ప్రసిద్ధమైనది. సంగారెడ్డి సమీపంలో కొండాపురం గ్రామంలో ప్రాచీన నాణేలు లభ్యం కావడంతో శాతవాహనుల కాలంనాటి చరిత్రకు ఇది ఊపిరి పోసింది. గోలకొండ సుల్తానుల కాలంలో గుల్షనాబాద్‌గా ఉన్న ఈ జిల్లా పేరు నిజాంకాలంలో మెదక్‌గా మారింది. మెదక్‌ పదం మెతుకు అనే పదానికి నామాంతరం. తెలంగాణ జిల్లాలోకెల్ల యీ ప్రాంతంలో వరి ఎక్కువ పండడంతో దీనికి మెదక్‌ అని పేరు పెట్టి ఉంటారు. ఈ జిల్లాకున్న ప్రాముఖ్యత ఏమిటంటే తెలంగాణాలోని రెండు సుబాలలో ఒకటి వరంగల్‌ పోగా రెండవది మెదక్‌. సంగారెడ్డి ఈ జిల్లాకు కేంద్రస్థానం. 1905కి పూర్వం ఈ జిల్లాలో మెదక్‌, రామాయంపేట, బాగత్‌, కలబ్‌గూరు, ఆందోల్‌, టేక్మల్‌ అనే తాలూకాలుండేవి. ఆ తర్వాత సిద్దిపేటను కొత్త తాలూకాగా ఏర్పరిచారు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు బీదరు జిల్లానుండి నారాయణ్‌ఖేడ్‌, జహీరాబాద్‌ తాలూకాలను కలిపారు. ఈ జిల్లానుంచి వికారాబాద్‌ తాలూకాను విడదీసి హైదరాబాద్‌ జిల్లాలో కలిపారు.

జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్‌ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు. అవి మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట

 

కొత్త జిల్లాలు:

ఆదిలాబాదు

Adilabad_District

విస్తీర్ణం: 4,153 చ.కి.మీ.
జనాభా: 7,21,433
అక్షరాస్యత: 63.01 శాతం
మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: ఆదిలాబాదు అర్బన్ మండలం
అత్యల్ప జనాభాగల మండలం: గడిగూడ
రెవెన్యూ డివిజన్లు: ఆదిలాబాదు, ఉట్నూరు
రెవెన్యూ గ్రామాలు: 504

నల్లగొండ

NALGONDA_District

విస్తీర్ణం: 6,863 చ.కి.మీ.
జనాభా: 16,31,399
అక్షరాస్యత: 65 శాతం
మండలాలు: 31
అత్యధిక జనాభాగల మండలం: నల్లగొండ
అత్యల్ప జనాభాగల మండలం: నేరేడుగొమ్ము
రెవెన్యూ డివిజన్లు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ
రెవెన్యూ గ్రామాలు: 565

నిర్మల్

NIRMAL_District

విస్తీర్ణం: 3,845 చ.కి.మీ.
జనాభా: 7,30,286
అక్షరాస్యత: 57.73 శాతం
మండలాలు: 19
అత్యధిక జనాభాగల మండలం: భైంసా
అత్యల్ప జనాభాగల మండలం: నర్సాపురం జి
రెవెన్యూ డివిజన్లు: నిర్మల్, భైంసా
రెవెన్యూ గ్రామాలు: 428

సూర్యాపేట

SURYAPET_District

విస్తీర్ణం: 3,374 చ.కి.మీ.
జనాభా: 10,99,560
అక్షరాస్యత: 63 శాతం
మండలాలు: 23
అత్యధిక జనాభాగల మండలం: సూర్యాపేట
అత్యల్ప జనాభాగల మండలం: నాగారం
రెవెన్యూ డివిజన్లు: సూర్యాపేట, కోదాడ
రెవెన్యూ గ్రామాలు: 279

మంచిర్యాల

Mancherial_District

విస్తీర్ణం: 3,943 చ.కి.మీ.
జనాభా: 7,07,050
అక్షరాస్యత: 61.81 శాతం
మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: మందమర్రి
అత్యల్ప జనాభాగల మండలం: భీమారం
రెవెన్యూ డివిజన్లు: మంచిర్యాల, బెల్లంపల్లి
రెవెన్యూ గ్రామాలు: 389

యాదాద్రి

YADADRI_District

విస్తీర్ణం: 3,092 చ.కి.మీ.
జనాభా: 7,26,465
అక్షరాస్యత: 68 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: భువనగిరి
అత్యల్ప జనాభాగల మండలం: అడ్డగూడూరు
రెవెన్యూ డివిజన్లు: భువనగిరి, చౌటుప్పల్
రెవెన్యూ గ్రామాలు: 296

కుమ్రంభీం ఆసిఫాబాదు

KomaramBheem_District

విస్తీర్ణం: 4,878 చ.కి.మీ.
జనాభా: 5,92,831
అక్షరాస్యత: 52.62 శాతం
మండలాలు: 15
అత్యధిక జనాభాగల మండలం: కాగజ్‌నగర్
అత్యల్ప జనాభాగల మండలం: లింగాపురం
రెవెన్యూ డివిజన్లు: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్
రెవెన్యూ గ్రామాలు: 435

జయశంకర్ భూపాలపల్లి

Jaya-Shankar_District

విస్తీర్ణం: 6,175 చ.కి.మీ.
జనాభా: 7,05,054
అక్షరాస్యత: 60 శాతం
మండలాలు: 20
అత్యధిక జనాభాగల మండలం: భూపాలపల్లి
అత్యల్ప జనాభాగల మండలం: కన్నాయి గూడెం
రెవెన్యూ డివిజన్లు: భూపాలపల్లి, ములుగు
రెవెన్యూ గ్రామాలు: 574

భద్రాద్రి కొత్తగూడెం

Kothagudem_District

విస్తీర్ణం: 8,062 చ.కి.మీ.
జనాభా: 11,02,094
అక్షరాస్యత: 62.63 శాతం
మండలాలు: 23
అత్యధిక జనాభాగల మండలం: పాల్వంచ
అత్యల్ప జనాభాగల మండలం: ఆళపల్లి
రెవెన్యూ డివిజన్లు: భద్రాచలం, కొత్తగూడెం
రెవెన్యూ గ్రామాలు: 449

మహబూబాబాదు

MAHABUBABAD_District

విస్తీర్ణం: 2,877 చ.కి.మీ.
జనాభా: 7,70,170
అక్షరాస్యత: 57 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: మహబూబాబాదు
అత్యల్ప జనాభాగల మండలం: గంగారం
రెవెన్యూ డివిజన్లు: మహబూబాబాదు, తొర్రూరు
రెవెన్యూ గ్రామాలు: 297

వరంగల్లు(రూరల్)

WARANGAL_District

విస్తీర్ణం: 2,175 చ.కి.మీ.
జనాభా: 7,16,457
అక్షరాస్యత: 66 శాతం
మండలాలు: 15
అత్యధిక జనాభాగల మండలం: పరకాల
అత్యల్ప జనాభాగల మండలం: ఖానాపూరు
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు, నర్సంపేట
రెవెన్యూ గ్రామాలు: 233

వరంగల్లు(అర్బన్)

WARANGAL_District

విస్తీర్ణం: 1,305 చ.కి.మీ.
జనాభా: 11,35,707
అక్షరాస్యత: 66 శాతం
మండలాలు: 11
అత్యధిక జనాభాగల మండలం: హన్మకొండ
అత్యల్ప జనాభాగల మండలం: ఐనవోలు
రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు
రెవెన్యూ గ్రామాలు: 133

సంగారెడ్డి

SANGAREDDY_District

విస్తీర్ణం: 4,441 చ.కి.మీ.
జనాభా: 15,23,758
అక్షరాస్యత: 64.26 శాతం
మండలాలు: 26
అత్యధిక జనాభాగల మండలం: జహీరాబాద్
అత్యల్ప జనాభాగల మండలం: సిర్గాపూర్
రెవెన్యూ డివిజన్లు: సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్
రెవెన్యూ గ్రామాలు: 600

రంగారెడ్డి

RANGAREDDY_District

విస్తీర్ణం: 5,006 చ.కి.మీ.
జనాభా: 25,51,731
అక్షరాస్యత: 75.87 శాతం
మండలాలు: 27
అత్యధిక జనాభాగల మండలం: సరూర్‌నగర్
అత్యల్ప జనాభాగల మండలం: చౌదరిగూడెం
రెవెన్యూ డివిజన్లు: రాజేంద్రనగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్
రెవెన్యూ గ్రామాలు: 594

మేడ్చల్

Malkajgiri_District

విస్తీర్ణం: 1,039 చ.కి.మీ.
జనాభా: 25,42,203
అక్షరాస్యత: 69 శాతం
మండలాలు: 14
అత్యధిక జనాభాగల మండలం: కుత్బుల్లాపూర్
అత్యల్ప జనాభాగల మండలం: ఘట్‌కేసర్
రెవెన్యూ డివిజన్లు: కీసర, మల్కాజ్‌గిరి
రెవెన్యూ గ్రామాలు: 161

హైదరాబాద్

HYDERABAD_District

విస్తీర్ణం: 217 చ.కి.మీ.
జనాభా: 39,43,323
అక్షరాస్యత: 83.25 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: బహదూర్‌పూర్
అత్యల్ప జనాభాగల మండలం: అమీర్‌పేట
రెవెన్యూ డివిజన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ గ్రామాలు: 100

కరీంనగర్

Karimnagar_District

విస్తీర్ణం: 2,379 చ.కి.మీ.
జనాభా: 10,18,119
అక్షరాస్యత: 61 శాతం
మండలాలు: 16
అత్యధిక జనాభాగల మండలం: కరీంనగర్
అత్యల్ప జనాభాగల మండలం: కొత్తపల్లి
రెవెన్యూ డివిజన్లు: కరీంనగర్, హుజురాబాద్
రెవెన్యూ గ్రామాలు: 215

సిరిసిల్ల రాజన్న

Sircilla_District

విస్తీర్ణం: 2,019 చ.కి.మీ.
జనాభా: 5,43,694
అక్షరాస్యత: 66.1 శాతం
మండలాలు: 13
అత్యధిక జనాభాగల మండలం: సిరిసిల్ల
అత్యల్ప జనాభాగల మండలం: వీర్నపల్లి
రెవెన్యూ డివిజన్లు: సిరిసిల్ల
రెవెన్యూ గ్రామాలు: 170

పెద్దపల్లి

PEDDAPALLE_District

విస్తీర్ణం: 2,236 చ.కి.మీ.
జనాభా: 7,95,332
అక్షరాస్యత: 60 శాతం
మండలాలు: 14
అత్యధిక జనాభాగల మండలం: రామగుండం
అత్యల్ప జనాభాగల మండలం: అంతర్గాం
రెవెన్యూ డివిజన్లు: పెద్దపల్లి, మంథని
రెవెన్యూ గ్రామాలు: 215

నిజామాబాదు

NIZAMABAD_District

విస్తీర్ణం: 4,261 చ.కి.మీ.
జనాభా: 15,77,108
అక్షరాస్యత: 54.42 శాతం
మండలాలు: 27
అత్యధిక జనాభాగల మండలం: నిజామాబాదు (ఉత్తరం)
అత్యల్ప జనాభాగల మండలం: నిజామాబాదు (దక్షిణం)
రెవెన్యూ డివిజన్లు: నిజామాబాదు, ఆర్మూరు, బోధన్
రెవెన్యూ గ్రామాలు: 438

సిద్దిపేట

SIDDIPET_District

విస్తీర్ణం: 3,432 చ.కి.మీ.
జనాభా: 10,02,671
అక్షరాస్యత: 61.45 శాతం, మండలాలు: 22
అత్యధిక జనాభాగల మండలం: సిద్దిపేట అర్బన్
అత్యల్ప జనాభాగల మండలం: కొమురవెల్లి
రెవెన్యూ డివిజన్లు: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాదు
రెవెన్యూ గ్రామాలు: 376

వికారాబాదు

VIkarabad_district

విస్తీర్ణం: 3,386 చ.కి.మీ.
జనాభా: 8,81,250
అక్షరాస్యత: 69 శాతం
మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: తాండూరు
అత్యల్ప జనాభాగల మండలం: బంట్వారం
రెవెన్యూ డివిజన్లు: వికారాబాదు, తాండూరు
రెవెన్యూ గ్రామాలు: 476

కామారెడ్డి

Kamareddy_District

విస్తీర్ణం: 3,667 చ.కి.మీ.
జనాభా: 9,74,227
అక్షరాస్యత: 48.49 శాతం
మండలాలు: 22
అత్యధిక జనాభాగల మండలం: కామారెడ్డి
అత్యల్ప జనాభాగల మండలం: బీబీపేట
రెవెన్యూ డివిజన్లు: కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి రెవెన్యూ గ్రామాలు: 474

నాగర్‌కర్నూలు

NAGARKURNOOL_District

విస్తీర్ణం: 2,966 చ.కి.మీ.
జనాభా: 8,60,613
అక్షరాస్యత: 54.04 శాతం
మండలాలు: 20
అత్యధిక జనాభాగల మండలం: నాగర్‌కర్నూలు
అత్యల్ప జనాభాగల మండలం: పదర
రెవెన్యూ డివిజన్లు: నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి రెవెన్యూ గ్రామాలు: 362

మహబూబ్‌నగరు

Mahabubnagar_District

విస్తీర్ణం: 4,037 చ.కి.మీ.
జనాభా: 12,90,467
అక్షరాస్యత: 57 శాతం
మండలాలు: 26
అత్యధిక జనాభాగల మండలం: మహబూబ్‌నగరు అర్బన్
అత్యల్ప జనాభాగల మండలం: రాజాపూరు
రెవెన్యూ డివిజన్లు: మహబూబ్‌నగరు, నారాయణపేట రెవెన్యూ గ్రామాలు: 454

జోగులాంబ గద్వాల

Jogulamba_District

విస్తీర్ణం: 2,928 చ.కి.మీ.
జనాభా: 6,64,971
అక్షరాస్యత: 51 శాతం
మండలాలు: 12
అత్యధిక జనాభాగల మండలం: గద్వాల
అత్యల్ప జనాభాగల మండలం: కృష్ణా
రెవెన్యూ డివిజన్లు: గద్వాల
రెవెన్యూ గ్రామాలు: 226

జనగాం

Jangaon_District

విస్తీర్ణం: 2,187 చ.కి.మీ.
జనాభా: 5,82,457
అక్షరాస్యత: 61 శాతం
మండలాలు: 13
అత్యధిక జనాభాగల మండలం: జనగాం
అత్యల్ప జనాభాగల మండలం: నర్మెట
రెవెన్యూ డివిజన్లు: జనగాం, స్టేషన్‌ఘనపురం
రెవెన్యూ గ్రామాలు: 200

మెదక్

MEDAK_District

విస్తీర్ణం: 2,723 చ.కి.మీ.
జనాభా: 7,67,428
అక్షరాస్యత: 55.52 శాతం
మండలాలు: 20
అత్యధిక జనాభాగల మండలం: మెదక్
అత్యల్ప జనాభాగల మండలం: రేగోడ్
రెవెన్యూ డివిజన్లు: మెదక్, తూప్రాన్, నర్సాపూరు
రెవెన్యూ గ్రామాలు: 381

ఖమ్మం

Khammam_District

విస్తీర్ణం: 4,360 చ.కి.మీ.
జనాభా: 13,89,566
అక్షరాస్యత: 62.26 శాతం, మండలాలు: 21
అత్యధిక జనాభాగల మండలం: ఖమ్మం అర్బన్
అత్యల్ప జనాభాగల మండలం: ఏన్కూరు
రెవెన్యూ డివిజన్లు: ఖమ్మం, కల్లూరు
రెవెన్యూ గ్రామాలు: 380

జగిత్యాల

Jagtial_District

విస్తీర్ణం: 3,043 చ.కి.మీ.
జనాభా: 9,83,414
అక్షరాస్యత: 54.53 శాతం, మండలాలు: 18
అత్యధిక జనాభాగల మండలం: జగిత్యాల
అత్యల్ప జనాభాగల మండలం: బుగ్గారం
రెవెన్యూ డివిజన్లు: జగిత్యాల, మెట్‌పల్లి
రెవెన్యూ గ్రామాలు: 284

వనపర్తి

WANAPARTHY_District

విస్తీర్ణం: 3,055 చ.కి.మీ.
జనాభా: 7,70,334
అక్షరాస్యత: 54 శాతం, మండలాలు: 14
అత్యధిక జనాభాగల మండలం: వనపర్తి
అత్యల్ప జనాభాగల మండలం: ఏదుల
రెవెన్యూ డివిజన్లు: వనపర్తి
రెవెన్యూ గ్రామాలు: 279

Comment here!