TSPSC Group 2 2016 Final Key & Cut-off Analysis-ఫైనల్ కీ & కటాఫ్ విశ్లేషణ

TSPSC Group 2 Final Key Analysis – గ్రూప్ 2 ఫైనల్ కీ & కటాఫ్ విశ్లేషణ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 2 ఫైనల్ కీ లో ప్రాథమిక కీ తో పోలిస్తే చాలా మార్పులు జరిగాయి.  మొత్తం నాలుగు పేపర్లలో కలిపి 17 ప్రశ్నలను తొలగించడం వల్ల వేల మంది అభ్యర్థుల భవితవ్యం తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడింది. వెయ్యి పోస్టులకు ఆరున్నర లక్షల మంది పోటీ పడుతుండడంతో ఈ 17 ప్రశ్నలను తొలగించడం కొందరికి మోదాన్ని, మరి కొందరికి ఖేదాన్ని కల్గిస్తుంది. ఈ ప్రశ్నలు తొలగించడం వల్ల ఫైనల్ కటాఫ్ ఊహించినదానికంటే 12-13 మార్కులు తగ్గే అవకాశం వుంది. పేపర్ల వారీగా ఫైనల్ కీని పరిశీలిస్తే:

పేపర్ -1:

ఈ పేపర్లో మొత్తం 6 ప్రశ్నలు తొలగించబడ్డాయి. 5 ప్రశ్నల జవాబులు మార్చబడ్డాయి. AB సిరీస్ లో చూస్తే జవాబులు మార్చబడిన ప్రశ్నల సంఖ్యలు : 15, 17, 77, 96, 141. దీని బట్టి చూస్తే 144 మార్కులకే ఈ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. కనుక 100 మార్కులకు పైన మార్కులు ఈ పేపర్లో సాధిస్తే అవి మంచి మార్కులు.

పేపర్ 2:

ఈ పేపర్లో మొత్తం 5 ప్రశ్నలు తొలగించబడ్డాయి. 5 ప్రశ్నల జవాబులు మార్చబడ్డాయి. AB సిరీస్ లో చూస్తే జవాబులు మార్చబడిన ప్రశ్నల సంఖ్యలు : 1, 28, 47, 74, 125. దీని బట్టి చూస్తే 145 మార్కులకే ఈ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. కనుక 105 మార్కులకు పైన మార్కులు ఈ పేపర్లో సాధిస్తే అవి మంచి మార్కులు.

పేపర్ 3:

ఈ పేపర్లో మొత్తం 3 ప్రశ్నలు తొలగించబడ్డాయి. 4 ప్రశ్నల జవాబులు మార్చబడ్డాయి. AB సిరీస్ లో చూస్తే జవాబులు మార్చబడిన ప్రశ్నల సంఖ్యలు : 59, 94, 118, 134. దీని బట్టి చూస్తే 147 మార్కులకే ఈ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. కనుక 100 మార్కులకు పైన మార్కులు ఈ పేపర్లో సాధిస్తే అవి మంచి మార్కులు.

పేపర్ 4:

ఈ పేపర్లో మొత్తం 3 ప్రశ్నలు తొలగించబడ్డాయి. 4 ప్రశ్నల జవాబులు మార్చబడ్డాయి. AB సిరీస్ లో చూస్తే జవాబులు మార్చబడిన ప్రశ్నల సంఖ్యలు : 6, 32, 127, 138. దీని బట్టి చూస్తే 147 మార్కులకే ఈ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. కనుక 110 మార్కులకు పైన మార్కులు ఈ పేపర్లో సాధిస్తే అవి మంచి మార్కులు.

మొత్తంగా చూస్తే ఫైనల్ కీ లో 18 ప్రశ్నల జవాబులు మార్చబడ్డాయి. 17 ప్రశ్నలు తొలగించబడ్డాయి. మొత్తంగా 35 ప్రశ్నల్లో మార్పులు చేయబడ్డాయి. ఇంత పెద్దమొత్తంలో మార్పులు అభ్యర్థుల తలరాతలు మార్చే విధంగా వున్నాయి.

ఇక ఫైనల్ కటాఫ్ విషయానికి వస్తే, ఓపెన్ కేటగిరి అభ్యర్థుల కటాఫ్ 420 + ఉండవచ్చు. మిగతావారికి 410+ కటాఫ్ ఉండవచ్చు. కనుక ఎవరికైతే 410 కి పైగా మార్కులు వస్తున్నాయో, వారు ఇంటర్వ్యూ  కోసం ఇప్పటి నుండే ప్రిపేర్ అవడం మంచిది.

 

Download TSPSC Group 2 Final Keys from below:

Group -2 Final Keys

Comment here!