Constitutional and Statutory Rights and Safeguards of Backward Classes – వెనుకబడిన తరగతుల హక్కులు – రక్షణలు

Constitutional Rights and Safeguards of Backward Classes in Telugu

Constitutional and Statutory Rights and Safeguards of Backward Classes (OBCs) – వెనుకబడిన తరగతుల హక్కులు – రక్షణలు

We have compiled complete information on constitutional, legal and statutory rights, provisions, articles and safeguards of Backward Classes (OBCs) in India. It includes specific articles mentioned in our constitution for the welfare and development of Backward Classes.

Rights and Safeguards of Backward Classes (OBCs) – వెనుకబడిన తరగతుల హక్కులు – రక్షణలు 

రాజ్యాంగపరమైన హక్కులు, రక్షణలు (Constitutional Rights and Safeguards)

  • Article 15(4): విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడినవారు లేదా SC, STల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు జారీచేయవచ్చు.
  • Article 15(5): సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారు లేదా SC, STల అభ్యున్నతి కోసం మైనారిటీ విద్యాసంస్థలు మినహాయించి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో ప్రవేశానికి సంబంధించిన చట్టం ప్రభుత్వం చేయవచ్చు.
  • Article 16(4): ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులవారికి సరైన ప్రాతినిధ్యం లేదని రాష్ట్రప్రభుత్వాలు భావిస్తే కొన్ని ఉద్యోగాలను వెనుకబడిన తరగతులవారికి కేటాయించడానికి ఆ రాష్ట్రప్రభుత్వం నిబంధనలను రూపొందించవచ్చు.
  • Article 46: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక అవకాశాలను కల్పించాలి.
  • Article 164(1): ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ గిరిజన జనాభా ఎక్కువ కాబట్టి ఈ రాష్ర్టాల్లో గిరిజన సంక్షేమం కోసం ఒక మంత్రి ఉండాలని ఈ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. అయితే SC, వెనుకబడిన వర్గాలవారి సంక్షేమానికి సంబంధించిన బాధ్యతలు కూడా గిరిజన శాఖ మంత్రికి అప్పగించవచ్చు.
  • Article 340: విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల పరిస్థితులను అధ్యయనం చేయడానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి, వారి స్థితిగతులను మెరుగుపర్చడానికి, వారి అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అభివృద్ధి చర్యలను సూచించడానికి రాష్ట్రపతి ఒక కమిషన్‌ను నియమించవచ్చు.
  • 1993 ఆగస్టు 14న రాష్ట్రపతి మొదటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ (National Commission for Backward Classes)ను ఏర్పాటు చేశారు.
  • Article 338 (10): Article 338(5) (A)లో పేర్కొనబడిన షెడ్యూల్డ్ కులాలు అనే ప్రస్తావనలో వెనుకబడిన తరగతులకు కూడా వర్తిస్తుంది. రాష్ట్రపతి అవసరమైతే ఈ అధికరణను ఆంగ్లోఇండియన్లకు కూడా వర్తింపచేయవచ్చు.

చట్టబద్దమైన హక్కులు – రక్షణలు (Statutory Rights and Safeguards)

  1. కేంద్రీయ విద్యాసంస్థల చట్టం (Central Educational Institutions Act), 2006 కింద కేంద్రీయ విద్యాసంస్థల ప్రవేశాల్లో OBCలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించాలి (OBC క్రీమీలేయర్ వర్గానికి మినహాయింపు ఉంటుంది).
  2. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం (National Commission for Backward Classes Act), 1993 నిర్దేశిస్తుంది.
  3. 1992 జనవరి 13న జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పనిచేస్తుంది. వెనుకబడిన తరగతుల్లో పేదరికం లో ఉన్నవారికి, ప్రభుత్వ సంస్థల ద్వారా రుణాలు మం జూరు చేసి వారిలో వృత్తి నైపుణ్యం, ఉన్నత విద్యను పెం పొందించడమే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
  4. కేంద్ర ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక డిపార్ట్‌మెంట్ వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది. ఈ డిపార్ట్‌మెంట్ జాతీయ వెనుకబడిన తరగతులకు కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ పనితీరును సమీక్షిస్తుంది.

Comment here!