Constitutional and Statutory Rights and Safeguards of Children – బాలల హక్కులు, రక్షణలు

Constitutional Rights and Safeguards of Children in Telugu

Constitutional and Statutory Rights and Safeguards of Children – బాలల హక్కులు, రక్షణలు

We have compiled complete information on constitutional, legal and statutory rights, provisions, articles and safeguards of Children in India. It includes specific articles mentioned in our constitution for the welfare and development of children.

రాజ్యాంగపరమైన హక్కులు, రక్షణలు (Constitutional Rights and Safeguards)

  • Article 15 (3) : రాజ్యం స్త్రీలు, పిల్లల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేకమైన నిబంధనలు రూపొందించవచ్చు.
  • Article 21(a) : 6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన బాలబాలికలకు ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను అందించాలి. భారత రాజ్యాంగంలో Article 45లో బాలలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని పేర్కొంది. దీనిని అమలు చేయడానికి 2002లో 86వ రాజ్యాంగ సవరణలో 6-14 సంవత్సరాలలోపు బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని Article 21a గా పేర్కొన్నారు. అంటే నిర్బంధ ప్రాథమిక విద్య ప్రస్తుతం ప్రాథమిక హక్కు
  • Article 24 : ఫ్యాక్టరీలు, గనుల్లోనూ 14 సంవత్సరాల వయసులోపు పిల్లలతో పని చేయించరాదు
  • Article 23 (1) : శ్రమశక్తిని దోచుకోవడం, మనుషులతో క్రయవిక్రయాలు జరపడం, పనిచేయించుకొని ప్రతిఫలం ఇవ్వకపోతే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
  • Article 39(e) : బాలలు గత్యంతర లేని పరిస్థితుల్లో వారు తమ శక్తికి మించి పనిచేస్తుంటారు. ఇలాంటివి ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రోత్సహించరాదు.
  • Article 39(f) : బాల్యం, యవ్వనం దోపిడీకి గురికాకుండా ఉండాలి. బాలల కోసం గౌరవప్రదమైన స్వేచ్ఛాయుత పరిస్థితుల్ని, వివిధ సౌకర్యాల్ని కల్పించి వారి అభివృద్ధికి కృషి చేయాలి.
  • Article 45 : 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ప్రభుత్వం నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యనందించాలి.
  • Article  51A(k): 6 నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు విద్యావకాశాలు కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. (ఈ అంశాన్ని 86వ రాజ్యాంగ సవరణ 2002లో ప్రాథమిక విధుల్లో చేర్చారు)
  • Article 350A : భాషా పరమైన మైనార్టీల బాలలకు ప్రాథమిక విద్యను మాతృభాషలోకి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించాలి.

చట్టబద్దమైన హక్కులు – రక్షణలు (Statutory Rights and Safeguards) & పార్లమెంట్ చట్టాలు 

  • 6 నుంచి 14 ఏండ్లలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యను అందించడానికి 2009లో భారత పార్లమెంట్ చట్టం చేసింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా Article 21(a) గుర్తించింది.
  • జువైనల్ జస్టిస్ చట్టం (Juvenile Justice Act) 2000: బాల నేరస్తుల రక్షణ, బాగోగులు చూడటం ఈ చట్టం ప్రధాన లక్ష్యం.
  • బాలకార్మికులు నిషేధ చట్టం, (Child Labour (Prohibition) Act) 1986 : 14 ఏండ్లలోపు బాలబాలికల్ని ప్రమాదకరమైన ఫ్యాక్టరీలో పనిచేయించడం ఈ చట్టం నిషేధిస్తుంది.
  • న్యాయసేవల చట్టం, 1987 (Legal Services Authorities Act) : ఈ చట్టం బాలలకు కావల్సిన న్యాయపరమైన సేవల్ని అందిస్తుంది
  • శిశు పౌష్టికాహార ఉత్పత్తి, సప్లయ్ చట్టం 1992 : శిశువులకు కావల్సిన తల్లిపాలకు ప్రత్యామ్నాయ పౌష్టికాహారం అందజేయడానికి ఉద్దేశించినది.
  • సంరక్షకుల చట్టం, (Guardian and Wards Act) 1890 : బాలలకు గార్డియన్స్ కల్పిస్తున్నప్పుడు బాలల సంక్షేమం గార్డియన్స్ బాధ్యత అని ఈ చట్టం నిర్దేశిస్తుంది.
  • బాలల చట్టం (Children’s Act),  1960 : కేంద్ర పాలిత ప్రాంతాల్లో, అనాథ బాలలు తప్పుదోవ పట్టిన బాలలు, తల్లిదండ్రులు విస్మరించిన, దుష్పప్రవర్తన ఉన్నటువంటి పిల్లల్ని సరైనమార్గంలో పెట్టడం, వారి సంక్షేమానికి, ఉన్నతికి సరైన విద్య, శిక్షణ కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
  • బాలల అక్రమ రవాణా నిషేధ చట్టం, (Immoral Trafficking Prohibition (Children) Act) 1956: బాలికల్ని అక్రమంగా తరలించి వారితో బలవంతంగా లైంగిక కార్యకలాపాల్ని చేయించడం, బాలికల్ని అమ్మడం ఈ చట్టం ప్రకారం నేరం.
  • శిశు నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం – 1994 : గర్భస్త దశలో ఉన్న శిశువు ఆడ, మగా నిర్ధారించే స్కానింగ్ పరీక్షలు ఈ చట్టం నిషేధిస్తుంది
  • బాల్య వివాహాల నిరోధక చట్టం, 2006 : 1929లో బాల్యవివాహ నిరోధక చట్టాన్ని 2006లో రద్దు చేసి దాని స్థానంలో నూతన బాల్యవివాహ నిరోధక చట్టం – 2006 రూపొందించారు.
  • కింద పేర్కొన్న చట్టాలు బాలల్ని, ఫ్యాక్టరీలలో పనిచేయడం నిషేధిస్తున్నాయి.
    ->ఫ్యాక్టరీస్ చట్టం, (Factories Act) 1948
    ->ప్లాంటేషన్ లేబర్ చట్టం (Plantation Labour Act), 1951
    ->మర్చంట్ షిప్పింగ్ చట్టం (Merchant Shipping Act), 1951
    ->మైనింగ్ చట్టం (Mining Act), 1952
    ->మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కింగ్ చట్టం (Motor Transport Working Act), 1961
    ->అప్రెంటీస్ చట్టం (Apprentice Act), 1961
    ->బీడీ, సిగార్స్ వర్కర్స్ చట్టం, 1966
  • కింద పేర్కొన్న మరికొన్ని చట్టాలు బాలల హక్కుల్ని సంరక్షిస్తున్నాయి. అవి
    ->Code of Criminal Procedure (CPC), 1973
    ->Indian Penal Code (IPC), 1860
    ->Indian Divorce Act, 1869
    ->Family Courts Act, 1984
    ->Hindu Adoption & Maintenance Act, 1956
    ->Hindu Marriage Act, 1955
    ->Indian Succession Act, 1925
    ->Muslim Women (Protection of Rights on Divorce) Act, 1956
    ->Parsi Marriage and Divorce Act, 1936
    ->Probation of Offenders Act, 1958
    ->Protection of Women from Domestic Violence Act, 2005
    ->Special Marriage Act, 1954
    ->Employees State Insurance Act, 1948
    ->Bonded Labour System Abolition Act, 1976
    ->Orphanages and Other Charitable Homes Act, 1960
  • జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, (National Child Rights Protection Commission) 2005 : రాజ్యాంగం పార్లమెంట్ బాలలకు కల్పించిన ప్రత్యేక హక్కులు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో సమీక్షించే సంస్థ ఇది. బాలలపై జరిగే నేరాలను సత్వరం విచారించి న్యాయం అందించడానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఈ కమిషన్ అవకాశం కల్పిస్తుంది.
  • లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ చట్టం – 2012 (Protection of Children from Sexual Offences Act) : బాలలతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఈ చట్టం శిక్షిస్తుంది. ఇలాంటి కేసులను సత్వర విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది.
  • 19-2-2014న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (Child Rights Protection Commission) ఏర్పాటుచేసింది. ఈ సంఘానికి కె.సుజాతరావు అధ్యక్షురాలు. 6 మంది సభ్యులను నియమించారు. వీరి పదవీకాలం మూడేండ్ల. సభ్యులకు గరిష్ట వయోపరిమితి 60 ఏండ్లు. చైర్‌పర్సన్‌కి 65 ఏండ్లు.

Comment here!