Constitutional and Statutory Rights and Safeguards of Disabled – వికలాంగుల హక్కులు

Constitutional Rights and Safeguards of Disabled and Physically and Mentally Challenged People in Telugu

Constitutional and Statutory Rights and Safeguards of Disabled/Physically Challenged – వికలాంగుల హక్కులు 

We have compiled complete information on constitutional, legal and statutory rights, provisions, articles and safeguards of Disabled, Physically and Mentally Challenged persons in India. It includes specific articles mentioned in our constitution for the welfare and development of Disabled, Physically Challenged persons .

రాజ్యాంగపరమైన హక్కులు, రక్షణలు (Constitutional Rights and Safeguards)

  • రాజ్యాంగంలోని పీఠిక (Preamble) : భారత పౌరులందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు ప్రజలందరిలో సోదరభావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం, ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడం. ఆలోచనల్లో స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ కల్పిస్తుంది. వికలాంగులు ఈ అంశానికి మినహాయింపు కాదు.
  • Article 14 : చట్టం ముందు అందరు సమానులే. చట్టం నుంచి ప్రజలందరికీ సమాన రక్షణ లభిస్తుంది. పౌరులకు ఉన్న ఈ హక్కుల్ని ప్రభుత్వం ఏ పౌరునికి నిరాకరించరాదు.
  • Article 41: రాజ్యం వృద్ధులకు, అశక్తులకు మొదలైనవారికి తగు సహాయం అందజేయాలి. వృద్ధాప్యం, అనారోగ్యం, నిరుద్యోగం, అంగవైకల్యం వంటి అశక్తులతో బాధపడేవారి అభివృద్ధి కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
  • భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో రాష్ట్ర జాబితాలో 9వ అంశం వికలాంగులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించుట అనే విషయాన్ని పేర్కొన్నది. ఈ అంశ అమలును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలి.

చట్టబద్దమైన హక్కులు – రక్షణలు (Statutory Rights and Safeguards) & పార్లమెంట్ చట్టాలు 

  • లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం (Legal Services Authorities Act), 1987 : వికలాంగులకు కావల్సిన న్యాయ సహాయాన్ని ఈ చట్టం ద్వారా ఉచితంగా పొందవచ్చు.
  • మానసిక ఆరోగ్య చట్టం, 1987 (Mental Health Act): మానసిక వికలాంగులకు కావాల్సిన వైద్య సదుపాయాల్ని ఈ చట్టం ద్వారా పొందవచ్చు.
  • భారతీయ పునరావాస కేంద్రాల చట్టం, 1992 (Rehabilitation Council of India Act): వికలాంగుల్లో మనోధైర్యం నింపడానికి, జీవితం పట్ల ఆసక్తి పెంపొందించడానికి వారికి కావల్సిన మానసిక ప్రోద్బలాన్ని అందజేయడానికి ఈ పునరావాస కేంద్రాల ను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రంలోని ఉద్యోగులకు కావల్సిన శిక్షణ, ఇతర సౌకర్యాలు ఈ చట్టం కల్పిస్తుంది.
  • వికలాంగుల సమాన అవకాశాలు, హక్కులు, పరిరక్షణ, పూర్తి భాగస్వామ్య చట్టం, 1995 (The Persons With Disabilities (Equal Opportunities, Protection of Rights and Full Participation) Act, 1995): ఈ చట్టం 1-1-1996 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం వికలాంగులను జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించేందుకు వారికి సమాన అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించినది. వికలాంగుల అభ్యున్నతి ఈ చట్టం లక్ష్యాల్లో అతి ముఖ్యమైనదిగా పేర్కొనవచ్చు. ఈ చట్టంలో ప్రధానాంశాలు కింది విధంగా ఉన్నాయి.
    ఎ) వికలాంగుల్లో ఏర్పడే సమస్యలను ముందస్తుగా గుర్తించి వాటి నివారణకు కావల్సిన తగిన చర్యలు తీసుకోవాలి.
    బి) వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం, పాక్షిక వైక ల్యం కలిగినవారికి 1 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. వారికి ఉద్యోగ ప్రవేశ పరీక్షలో వయో పరిమితిని పెంచాలి.
    సి) ప్రభుత్వం అమలు చేసే పేదరిక నిర్మూలన పథకాల ఫలాల్ని 3 శాతం వికలాంగులకు కేటాయించాలి.
    డి) వికలాంగులకు బహిరంగ ప్రదేశాల్లో కలిగే సమస్యలను తొలగించడానికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి.
    ఉదా : బస్సులు, విమానాలు, రైళ్లలో ఎక్కడానికి కావల్సిన ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం ప్రభుత్వం బాధ్యత.
    ఇ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికల్లో, వాటి వార్షిక బడ్జెట్‌లో వీరి సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి.
    ఎఫ్) ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 2013లో సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించింది. అయితే రిజర్వేషన్లు 50 శాతం పెంచాలనే సూత్రం ఈ రిజర్వేషన్లలో వర్తించడాన్ని పేర్కొంది.
  • వికలాంగుల హక్కుల చట్టం (The Rights of Persons with Disabilities Act), 2016: భారత ప్రభుత్వం మరిన్ని వైకల్యాలను కలిగిన వ్యక్తులను వికలాంగుల జాబితాలో చేర్చింది.

One thought on “Constitutional and Statutory Rights and Safeguards of Disabled – వికలాంగుల హక్కులు”

Comment here!