Hyderabad Police Action – Operation Polo – Hyderabad State Integration

Hyderabad Police Action - Operation Polo - Hyderabad State Integration in Telugu

Everything you need to know about Hyderabad Police Action – Operation Polo – Hyderabad State Integration into Indian Union – ఆపరేషన్ పోలో – హైదరాబాద్ పై పోలీస్ చర్య – భారత యూనియన్లో హైదరాబాద్ రాజ్య విలీనం

We have compiled complete information on Hyderabad Police Action, Operation Polo, Razakars in Hyderabad State, Standstill Agreement, Hyderabad Province integration into Indian Union, Military Government in Hyderabad in Telugu for candidates preparing for TSPSC Group -1, Group -2 and Group -3 exams.

1947 ఆగష్టు 15 న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్ రాజ్యానికి మాత్రం స్వాతంత్యం లభించలేదు. హైదరాబాద్ రాజ్యం ఎలా భారత యూనియన్లో విలీనం అయిందో ఇప్పుడు చూద్దాం.

యథాతథ ఒప్పందం (Standstill Agreement)

 • 1947 నవబంబర్ 29న భారత ప్రభుత్వం నిజాం రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు ఈ ఒప్పందం జరిగింది. ఇందులో చత్తారి నవాబు (Chattari Nawab) కీలకపాత్ర పోషించాడు. దీని ప్రకారం నిజాం రాజ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా కేఎం మున్షీ (K M Munshi) నియమితుడయ్యాడు. ఇతను దక్కన్ హౌస్‌లో నివాసం ఉన్నాడు.
 • ఢిల్లీలో నిజాం రాజ్య ప్రతినిధిగా జైన్‌ యార్‌జంగ్ నియమించబడ్డాడు.

ఒప్పంద ముఖ్యాంశాలు

 • నిజాం రాజ్యం భారత యూనియన్‌కు అనుబంధంగా ఉండాలి.
 • 15 ఆగస్టు 1947 కంటే ముందు బ్రిటీషువారికి, నిజాం నవాబుకు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలకు సంబంధించిన ఒప్పందాలు, పరిపాలనా సంబంధం ఏర్పాట్లు, ఇండియన్ యూనియన్ డొమినియన్‌కు నిజాంకు మధ్య కొనసాగుతాయి.
 • ఉమ్మడి వ్యవహారాల్లో విదేశీ వ్యవహారాలు, రక్షణ సమాచార అంశాలు చేర్చారు. ఇది భారత యూనియన్‌కు అనుకూలమే అయినప్పటికీ శాంతిభద్రతల పేరుతో నిజాం అనుమతితో హైదరాబాద్ రెసిడెన్సీలో సైన్యాలు ఉంచడానికి భారత యూనియన్‌కు మాత్రం అనుమతిలేదు.
 • ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటినుంచి ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. దీనిప్రకారమే హైదరాబాద్ రాజ్యంలో ఇండియన్ యూనియన్ ప్రతినిధిని, ఢిల్లీలో హైదరాబాద్ ప్రతినిధిని నియమించారు.
 • ఈ ఒప్పందం ద్వారా పాకిస్థాన్‌లో విలీనమయ్యే ఉద్దేశం హైదరాబాద్ రాజ్యానికి లేదని స్పష్టమయ్యింది.
 • తాత్కాలికంగానైనా రక్షణ, విదేశీ, విత్త వ్యవహారాలు భారత యూనియన్ పొందడం గమనించాల్సిన విషయం.
 • ఈ ఒప్పందాన్ని ఉల్లఘించాలంటూ నిజాంపై ఖాసింరజ్వీ ఒత్తిడి తెచ్చాడు. అదేవిధంగా తనకు అనుకూలురైన కొందరిని ఉన్నత పదవుల్లో నియమించుకున్నాడు.
 • ప్రధానమంత్రిగా లాయక్ అలీని, ఉప ప్రధానిగా రాజాబహదూర్ పింగళి వెంకట్రామారెడ్డిని నియమించాడు.
 • లాయక్ అలీ తన మంత్రివర్గంలో నలుగురు హిందూ మంత్రులను నియమించుకున్నాడు. వారు
  1) పింగళి వెంకట్రామారెడ్డి 2) బీఎస్ వెంకట్రావ్ 3) మల్లికార్జునప్ప 4) జీవీ జోషి

ఒప్పంద ఉల్లంఘనలు

 •  గోల్కొండ, చాదర్‌ఘాట్, మోతీమహల్‌లో నిజాం ఆయుధ కర్మాగారాలు స్థాపించాడు.
 • భారత కరెన్సీ తన రాజ్యంలో చెల్లదని ప్రకటించాడు. పాకిస్థాన్‌కు రూ. 20 కోట్ల అప్పు ఇవ్వడానికి అంగీకరించాడు (సెక్యూరిటీ పత్రాల రూపంలో).
 • బంగారం ఎగుమతిపై నిషేధాజ్ఞలు జారీ చేశాడు. విమానాల కొనుగోలు కోసం తన సర్వసైన్యాధిపతి ఎల్‌డ్రూస్‌ (El Edroos)ను విదేశాలకు పంపించాడు.
 • రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న సిడ్నీ కాటన్, హెన్నీలష్‌విజ్‌ల ద్వారా ఆయుధాల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బ్రిడ్జిల్ని కూల్చడానికి ఉపయోగించే మందుగుండు సామగ్రి సరఫరా కోసం మూర్ (బ్రిటీష్ మాజీ సైనికాధికారి)తో ఒప్పందం చేసుకున్నాడు.

భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు

 • భారత వాయు రవాణా సంస్థకు విమానాలు హైదరాబాద్ సరిహద్దులు దాటకూడదని పేర్కొంది. దక్కన్ ఎయిర్‌వేస్ సేవల్ని నిలిపివేసింది.
 • హైదరాబాద్ రాజ్యం ద్వారా వెళ్లే రైళ్లను రోజుకొకటి పరిమితం చేసి పహారాను ముమ్మరం చేసింది. హైదరాబాద్ రాజ్యంలో జరిగే బంగారు, నాణేల ఎగుమతిపై నిషేధం, ఇంపీరియల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హైదరాబాద్ స్టేట్ బ్యాంకు సంబంధాల్ని రద్దు చేయడం, హైదరాబాద్‌కు చెల్లించాల్సిన రుణమొత్తాన్ని నిలిపివేస్తూ రిజర్వ్ బ్యాంకుకు ఆదేశాలివ్వడం మొదలైన చర్యల్ని భారత యూనియన్ చేపట్టింది.

ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు

 • 9 ఆగస్టు, 1948న లాయక్ అలీ హైదరాబాద్ రాజ్యానికి భారత ప్రభుత్వంతో గల వివాదాన్ని ఐక్యరాజ్యసమితికి తెలుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.
 • రజాకార్లను నిషేధించి, సంస్థానంలో శాంతిభద్రతల్ని పునరుద్ధరించాల్సిందిగా సీ రాజగోపాలచారి (నాటి భారత గవర్నర్ జనరల్) 31 ఆగస్టు 1948న నిజాంకు లేఖ రాశారు.
 • 10 సెప్టెంబర్, 1948న మోయిన్ నవాబ్‌జంగ్ నాయకత్వంలో నిజాం రాష్ట్ర సమస్యను ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసేందుకు ఒక ప్రతినిధి బృందం వెళ్లింది.
 • గత్యంతరం లేని పరిస్థితుల్లో హైదరాబాద్ సంస్థానాన్ని రక్షించడానికి సైనిక చర్య జరపాలని భారతప్రభుత్వం నిర్ణయించుకుంది.

రజాకార్లు (Razakars)

Everything you need to know about Hyderabad Police Action - Operation Polo - Hyderabad State Integration into Indian Union - Razakars

 • రజాకార్లు అంటే శాంతిరక్షకులు అని అర్థం.
 • రెండో ప్రపంచ యుద్ధకాలంలో(1939) హైదరాబాద్ రాజ్యానికి చెందిన సైనిక దళాలు ప్రపంచయుద్ధరంగానికి వెళ్లినప్పుడు స్థానికంగా శాంతిభద్రతల నిర్వహణలో ప్రజలకు, ప్రభుత్వానికి సహాయపడేందుకు ఈ స్వచ్ఛంద సేవాదళం ఏర్పడింది .
 • దీనిని నాటి MIM అధ్యక్షుడు బహదూర్‌ యార్‌జంగ్ ఏర్పాటు చేశారు. ఇతను గొప్పవక్త. అసలుపేరు బహదూర్‌ఖాన్. ఇతని ఉపన్యాసాన్ని విన్న మీర్ ఉస్మాన్ అలీఖాన్ అతనికి బహదూర్‌యార్‌జంగ్ అనే బిరుదును ఇచ్చాడు.
 • యువసిసిరో అనే బిరుదు కూడా ఇతనికి ఉంది.
 • ఖాకీ చొక్కా, ఖాకీ ప్యాంటు లేదా నిక్కర్, పెద్ద నల్లని బెల్ట్, పిడి బాకు, కర్ర, నల్ల టోపీలను రజాకార్లు యూనిఫాంగా ధరించేవారు.
 • ఈ స్వచ్ఛంద దళాన్ని ఖాసిం రజ్వీ సైనిక శక్తిగా మార్చాడు . బైరాన్‌పల్లి గ్రామంలో 88 మందిని నిలబెట్టి కాల్చారు రజాకార్లు. మహిళలను కొన్ని గ్రామాల్లో నగ్నంగా బతుకమ్మలు ఆడించారు. బీబీనగర్‌లో హిందూ కుటుంబాలనై దాడిచేసి అనేక అకృత్యాలకు పాల్పడ్డారు.
 • అసఫ్‌జాహీల పతాకాన్ని ఎర్రకోటపై ఎగురవేస్తానని ప్రగల్బాలు పలికాడు రజ్వీ. జాతీయనాయకుల్ని విమర్శిస్తూ ప్రసంగాలు చేశాడు.
 • చివరకు భారతసైన్యానికి పట్టబడి జైలుపాలయ్యాడు. 1957 సెప్టెంబర్ 11న శిక్ష పూర్తై విడుదలైన తరువాత పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. చివరకు 15 జనవరి, 1970న మరణించాడు.
 • ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ (The Tragedy of Hyderabad) అనే గ్రంథంలో రజాకార్ల పాత్రను హైదరాబాద్ ప్రధాని లాయక్ అలీ సమర్థించడం.

పద్మజానాయుడి నివేదిక

 • ఆకునూరు, మాచిరెడ్డిపల్లిలో ప్రజలు దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా సాగించిన పోరాటాలు మహాత్మాగాంధీని ఆకర్షించాయి. దీనిపై ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా గాంధీజీ, పద్మజానాయుడిని కోరారు.
 • బైరాన్‌పల్లి, రేణిగుంట, గుండ్రాంపల్లి, మాచిరెడ్డిపల్లి, రాయికోడ్, ఆకునూరు గ్రామాల్లో ప్రజల్ని కాల్చి చంపారు.
 • నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినవారిలో ముఖ్యులు రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొయినొద్దీన్, పుచ్చలపల్లి సుందరయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మ, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కట్కూరి రామచంద్రారెడ్డి, డొడ్డి కొమురయ్య, దొడ్డి ఎల్లయ్య మొదలైనవారు.

ఆపరేషన్ పోలో (Operation Polo) (13 – 17 సెప్టెంబర్ 1948)

Everything you need to know about Hyderabad Police Action - Operation Polo - Hyderabad State Integration into Indian Union

 • ఈ సైనిక చర్య 5 రోజుల పాటు జరిగింది.
 • 13 సెప్టెంబర్ తెల్లవారుజామున ఈ చర్య ప్రారంభమైంది. ముఖ్యంగా నాలుగు ప్రదేశాల నుంచి ప్రారంభించారు. అవి
  1) షోలాపూర్ – జయంతినాథ్ చౌదరి (Jayanti Nath Choudhary)
  2) బాంబే – బ్రార్ (Brar)
  3) బీరార్ – మేజర్ శివదత్ (Major Shivdutt)
  4) మద్రాస్-మేజర్ రుద్ర (Major Rudra) (విజయవాడ, సూర్యాపేట మీదుగా)
 • ఆపరేషన్ పోలో వైమానిక దళానికి ఎయిర్‌వేస్ మార్షల్ ముఖర్జీ నాయకత్వం వహించారు. ఈ సమయంలో సౌత్ కమాండెంట్‌గా జనరల్ మహరాజా రాజేంద్రసింగ్ ఉన్నారు.
 • సెప్టెంబర్ 13న బెజవాడ నుంచి రుద్ర షోలాపూర్ నుంచి సైన్యాలు బయల్దేరి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ నల్దుర్ పట్టణం వద్ద ఎత్తైన ప్రాంతాన్ని ఆక్రమించాయి.
 • సెప్టెంబర్ 17న భారత సైన్యం గెలిచింది. నిజాం సైన్యం తన ఓటమిని ఒప్పుకుంది. ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వ అధికార రేడియో (దక్కన్ రేడియో) ద్వారా ప్రసంగించి తాను లొంగిపోతున్నట్లు పేర్కొన్నాడు. హైదరాబాద్‌కు వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికాడు నిజాం.
 • సెప్టెంబర్ 22న ఐక్యరాజ్యసమితిలో తాను చేసిన ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నట్లు భద్రతామండలికి నిజాం తెలిపాడు.

జేఎన్ చౌదరి ప్రభుత్వం (J N Choudhary Government or Military Government)

 • జేఎన్ చౌదరి మిలటరీ గవర్నర్‌గా నియామకమయ్యారు. ఇతను బెంగాల్‌కు చెందిన వ్యక్తి.
 • ఈ ప్రభుత్వం 18 సెప్టెంబర్ 1948 నుంచి 25 జనవరి 1950 వరకు కొనసాగింది. రాజ్యాధినేతగా ఉస్మాన్ అలీఖాన్ వ్యవహరించాడు. చౌదరి పాలనలో సహాయపడినవారు.
  1) డీఎస్ బాఖ్లే (IPS ఆఫీసర్)
  2) నవాబ్ జైన్‌యార్ జంగ్
  3) రాజా దొండేరాజా
  4) సీవీఎస్ రావు
  5) సీహెచ్ కృష్ణారావు

ఎంకే వెల్లోడి ప్రభుత్వం (M K Vellodi Government or Civilian Government)

 • హైదరాబాద్‌లో 26 జనవరి 1950న తొలి పౌర ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఎంకే వెల్లోడి (మిల్లర్ కాడింగ్ వెల్లోడి) ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు. ఇతను కేరళకు చెందిన వ్యక్తి.

బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం (First Democratic Government)

 • 1952, మార్చి 6వ తేదీన బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. హైదరాబాద్ రాష్ర్టానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ రాష్ర్టానికి మొదటి, చివరి సీఎం కూడా ఈయనే. ఈయన షాద్‌నగర్ నుంచి ఎన్నికయ్యారు.

రాజ్‌ప్రముఖ్‌గా నిజాం

 • 1950 జనవరి 26 హైదరాబాద్ రాష్ర్టానికి రాజ్‌ప్రముఖ్ (అంటే నేటి గవర్నర్)గా వ్యవహరించాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్.
 • వార్షిక భరణంగా ఏడాదికిగాను రూ. 1.25 కోట్లు భారత ప్రభుత్వం ఇతనికి చెల్లించింది.
 • ఆంధ్రప్రదేశ్ ఏర్పడేవరకు ఉస్మాన్ అలీఖాన్ రాజ్‌ప్రముఖ్‌గా వ్యవహరించాడు. చివరకు 24 ఫిబ్రవరి 1967న మరణించాడు.

Comment here!