Indian Economic Survey 2016-17 Important Points in Telugu – భారత ఆర్ధిక సర్వే ముఖ్యాంశాలు

Indian Economic Survey 2016-17 Important Points in Telugu

Indian Economic Survey 2016-17 Important Points in Telugu- భారత ఆర్ధిక సర్వే 2016-17 ముఖ్యాంశాలు:

We have compiled important points of Indian Economic Survey 2016-17 in Telugu for Telugu medium candidates preparing for UPSC Civil Services, APPSC and TSPSC Group -1, Group -2 and Group -3 exams in India.

భారత ఆర్ధిక రంగ వృద్ధిరేటు అంచనాలు:

  • 2016-17 ఆర్ధిక సంవత్సరానికిగాను భారత ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటును 6.5% గా ఆర్ధిక సర్వే 2016-17 అంచనా వేసింది.
  • 2017-18 ఆర్ధిక సంవత్సరానికిగాను ఆర్ధిక వ్యవస్థ 6.75% – 7.5% వృద్ధిరేటును సాధిస్తుందని అంచనా వేసింది.
  • వ్యవసాయ రంగం 4.1% వృద్ధిరేటును సాధించింది. 2015-16 సంవత్సరంలో ఇది కేవలం 1.2%గా నమోదు అయింది.
  • పారిశ్రామిక రంగం 2016-17 లో 5.2% వృద్ధిరేటును సాధించింది. 2015-16 సంవత్సరంలో ఇది 7.4%గా నమోదు అయింది.
  • సేవల రంగం 8.8% వృద్ధిరేటును సాధించింది.

ద్రవ్యోల్బణం (Inflation):

  • వినియోగదారుల ధరల సూచీ (CPI) ఏప్రిల్ – డిసెంబర్, 2016 నెలల మధ్య 4.9%గా నమోదు అయింది.
  • టోకు ధరల సూచీ (WPI) డిసెంబర్, 2016 నాటికి 3.4% గా నమోదు అయింది. అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం దీనికి ముఖ్య కారణం.

విత్త లోటు (Fiscal Deficit):

  • 2017-18 ఆర్ధిక సంవత్సరంలో  విత్త లోటును 3.5% కు తగ్గించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది.

కరెంట్ ఖాతా లోటు (Current Account Deficit):

  • 2016-17 ఆర్ధిక సంవత్సరానికి గాను కరెంట్ ఖాతా లోటు 0.3% కు తగ్గింది.

వాణిజ్య లోటు (Trade Deficit):

  • 2016-17 లో గత సంవత్సరంతో పోలిస్తే  వాణిజ్య లోటు 23.5% తగ్గింది.

విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves):

  • డిసెంబర్, 2016 నాటికి విదేశీ మారక నిల్వలు 360 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

ప్రభుత్వ ఋణం (Government Debt):

  • ప్రభుత్వ రుణం మొత్తం జీడీపీ లో 68.5% గా వుంది. గత సంవత్సరం ఇది 69.1% గా వుంది.

పెద్దనోట్ల రద్దు (Demonetisation):

  • స్వల్పకాలికంగా పెద్దనోట్ల రద్దు వృద్ధిరేటును 0.25% – 0.5% మధ్య తగ్గించినా, దీర్ఘకాలంలో దీని ద్వారా ఉపయోగపడవచ్చు.

సార్వత్రిక కనీస ఆదాయం (Universal Basic Income):

  • దేశంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సార్వత్రిక కనీస ఆదాయం-UBI అనే కొత్త ఆలోచనను ఆర్థిక సర్వే పేర్కొన్నారు. నగదు బదిలీ ద్వారా పేదలకు కనీస ఆదాయం తప్పనిసరిగా లభించేలా చర్యలు తీసుకోవడమే యూబీఐ లక్ష్యం. ఈ విధానం ప్రకారం ప్రస్తుతం వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న రాయితీలను పూర్తిగా రద్దు చేసి వాటిని బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా ప్రజలకు అందిస్తారు.
  • దీనికోసం దేశ జీడీపీలో 4-5% మొత్తం ఖర్చు అవుతుందని సర్వే అంచనా వేసింది.

ఆర్థిక సర్వే మన దేశానికి సంబంధించిన 8 ఎనిమిది ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. అవి:

1. పెరుగుతున్న వలసలు:

దేశంలో వలసలు నానాటికీ పెరుగుతున్నాయి. రైలు ప్రయాణీకుల లెక్కల ప్రకారం పనుల కోసం వలస వెళ్ళే వారి సంఖ్య ఏటా 90 లక్షలుగా వుంది. ఇది 2011 జనాభా లెక్కల్లో పేర్కొన్న వలసల కంటే రెట్టింపు కావడం గమనార్హం.

Economic Survey 2016-17 - Migration important points in Telugu

2. రేటింగ్ సంస్థల వివక్షాపూరిత దృక్కోణం:

రేటింగ్ సంస్థలు మన దేశాన్ని ఒకలాగా, పొరుగున ఉన్న చైనా ను ఒకలాగా చూస్తూ, మన ఆర్ధిక వ్యవస్థకు రేటింగ్ ఇవ్వటంలో వివక్షను ప్రదర్శిస్తున్నాయి. ఉదాహరణకు చైనా వృద్ధి రేటు పడిపోతున్నా ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ రేటింగ్ ను AA నుండి AA+ కు పెంచగా, భారత ఆర్ధిక వ్యవస్థ రేటింగ్ ను BBB- స్థాయిలోనే మార్చకుండా వుంచేసాయి.

Economic Survey 2016-17 - Rating Important Points in Telugu

 

 

 

One thought on “Indian Economic Survey 2016-17 Important Points in Telugu – భారత ఆర్ధిక సర్వే ముఖ్యాంశాలు”

Comment here!