
Andhra Pradesh Economy Statistics 2015-16 – ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ గణాంకాలు
We are providing important statistics of Andhra Pradesh Economy for the year 2015-16 in Telugu. It will help candidates preparing for APPSC Group 1, Group 2 and Group 3 Exams.
2015-16 ఆర్ధిక సంవత్సరంలోని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ గణాంకాలు మీకు తెలుగులో అందిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ గణాంకాలు 2015-16
- 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 10.5 శాతం వృద్ధిరేటు సాధించింది. కృష్ణాజిల్లా తొలి స్థానంలో నిలిచింది. రాష్ట్రం మొత్తం రూ.5.57 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి సాధించగా అందులో కృష్ణా జిల్లా నుంచే రూ.66 వేల కోట్ల స్థూల విలువ వచ్చింది.
- రూ.1.24 లక్షల తలసరి ఆదాయంతో విశాఖపట్నం జిల్లా తొలిస్థానంలో నిలిచింది. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.93,231 అయితే ఆంధ్రప్రదేశ్లో అది రూ.1,07,532కి చేరింది. 2011-12 సంవత్సరాన్ని ప్రాతిపదికగా చేసుకుని స్థిర ధరల ఆధారంగా వీటిని రూపొందించారు.
- స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలో మొదటి మూడు మండలాలు – విశాఖపట్టణం అర్బన్ (రూ.16,468 కోట్ల స్థూల ఉత్పత్తి), విజయవాడ (రూ.15,856 కోట్లు), గాజువాక (రూ.12,592 కోట్లు) మండలాలు
- వ్యవసాయ పరంగా కృష్ణాజిల్లా కలిదిండి మండలం (రూ.1223 కోట్లు), పశ్చిమగోదావరి జిల్లా కల్ల మండలం (రూ.933 కోట్లు), భీమవరం మండలం (రూ.899 కోట్లు) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
- పారిశ్రామికంగా గాజువాక (రూ.7266 కోట్లు), విశాఖపట్టణం అర్బన్ (రూ.2691 కోట్లు), రాజమండ్రి (రూ.1513 కోట్లు) మండలాలు అగ్రస్థానంలో నిలిచాయి.
- సేవల రంగంలో విశాఖపట్నం అర్బన్ (రూ.13,253 కోట్లు), విజయవాడ (రూ.13,234 కోట్లు), గుంటూరు (రూ.7,159 కోట్లు) అగ్రస్థానంలో నిలిచాయి.
- తలసరి ఆదాయపరంగా గాజువాక (రూ.4,09,235), నర్సరావు పేట (రూ.2,53,935), అచ్యుతాపురం (రూ.2,53,334) మండలాలు రాష్ట్రంలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తి వివరాలు | |||||
జిల్లా | స్థూలఉత్పత్తి (రూ.కోట్లలో) |
2015-16 లోవృద్ధి% |
ర్యాంకు | తలసరిఆదాయం | ర్యాంకు |
కృష్ణా | 66,750 | 12.88 | 1 | 1,40,593 | 2 |
విశాఖపట్నం | 65,130 | 12.23 | 2 | 1,40,628 | 1 |
తూర్పుగోదావరి | 57,660 | 10.21 | 3 | 1,04,336 | 7 |
గుంటూరు | 55,870 | 8.74 | 4 | 1,09,556 | 5 |
పశ్చిమగోదారి | 50,320 | 11.75 | 5 | 1,21,784 | 3 |
చిత్తూరు | 43,870 | 11.25 | 6 | 1,00,443 | 8 |
అనంతపురం | 37,970 | 7.71 | 7 | 89,084 | 10 |
ప్రకాశం | 37,640 | 9.13 | 8 | 1,07,706 | 6 |
కర్నూలు | 36,850 | 8.47 | 9 | 88,308 | 11 |
నెల్లూరు | 35,850 | 11.7 | 10 | 1,15,928 | 9 |
కడప | 27,570 | 8.37 | 11 | 91,888 | 9 |
విజయనగరం | 21,190 | 9.99 | 12 | 86,223 | 12 |
శ్రీకాకుళం | 20,990 | 11.47 | 13 | 74,638 | 13 |
మొత్తం | 5,57,650 | 10.50 | – | 1,07,532 | – |
రంగాలవారీగా వృద్ధిరేటు | |||
రంగం | సాధించింది (రూ.కోట్లలో) |
లక్ష్యం (%) | సాధించింది(%) |
వ్యవసాయం | 1,21,915 | 9.86 | 8.4 |
పరిశ్రమలు | 1,21,178 | 7.74 | 11.13 |
సేవలు | 2,12,391 | 12.32 | 11.39 |
మొత్తం | 4,55,484 | 10.83 | 10.50 |
But in exam may be ask 2016-17 economic survey data