APPSC గ్రూప్ -2 కు ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ -2 కు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ బుక్స్ చదవాలి?

అనే ప్రశ్నలు గ్రూప్ 2 పరీక్షకోసం సన్నద్ధమవుతున్న లక్షల మంది మెదళ్ళను తొలిచే ప్రశ్నలు. 

ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్ష కోసం ఆరున్నర లక్షలపైగా  దరఖాస్తులు కమిషన్ కు చేరాయి. దరఖాస్తు చేసుకొన్నఅభ్యర్థులందరూ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు.

ఒకసారి గ్రూప్ -2 పరీక్ష విధానాన్ని పరీక్షిస్తే, ముందుగా ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) జరుగుతుంది.

ఇందులో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఈ పరీక్ష కోసం వివరణాత్మకంగా(textbooks) చదవాలా? లేక బిట్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా? అని అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారు. నిజానికి, రెండూ చేయాలి, ఏ ఒక్కటి చేసినా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

కేవలం బిట్లు చదవడం వల్ల అభ్యర్థులు త్వరగా మరచిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందులోనూ వర్తమానాంశాలు, భారత రాజకీయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ వంటి సబ్జెక్టులు చదివేటప్పుడు ఎన్నో గణాంకాలను, సంఘటనలను, తేదీలను గుర్తుంచుకోవాల్సి వస్తుంది. బిట్ల రూపంలో వాటిని చదవడం వల్ల గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది. పైగా అనువర్తన కోణంలో(application orientation) ప్రశ్నలు వస్తే జవాబులు గుర్తించడంలో అభ్యర్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.

అందుకే ముందుగా మౌలికాంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం 6 వ తరతి నుండి 10 వ తరగతి వరకు గల పాఠ్య పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి.

తర్వాత సిలబస్ ప్రకారం అన్ని విభాగాలను వరుసగా చదవాలి. ఒక విభాగం పూర్తయితే వెంటనే దానికి సంబంధించిన బిట్లు ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా అన్ని విబాగాలను పూర్తి చేయాలి. అంటే చదవడం + ప్రాక్టీసు చేయడం అనే పద్ధతిని పాటించాలి.

సిలబస్ లో పెట్టిన ఏ ఒక్క విభాగాన్ని వదిలి పెట్టొద్దు. పైగా, చదివేటప్పుడు సిలబస్ లో ఉన్న అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.

కరెంట్ అఫైర్స్ నెలల వారీగా అన్ని అంశాలను అధ్యయనం చేయాలి. వీలైనన్ని ఎక్కువ బిట్లకు సమాధానాలు గుర్తించాలి. ఈ ప్రాక్టీస్ కూడా వీలైనన్ని ఎక్కువసార్లు చేయాలి.

సిలబస్ లో ఏ విభాగాన్ని విడిచిపెట్టకుండా చదవాలి. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి బిట్ కు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని అభ్యర్థులు గుర్తించాలి.

Comment here!