TSPSC Group 2 Interview Preparation – గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎదుర్కోవడం ఎలా?

TSPSC Group 2 Interview Preparation

TSPSC Group 2 Interview Preparation Tips, Strategy, Planning, Do’s and Don’ts – గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎదుర్కోవడం ఎలా?

గ్రూప్ 2 పరీక్షలో అభ్యర్థుల భవితవ్యాన్నితేల్చేది ఇంటర్వ్యూనే. 75 మార్కులున్న ఇంటర్వ్యూలో ఇప్పటినుండే ప్రిపరేషన్ ప్రారంభిస్తే 60కి పైగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఇంటర్వ్యూ అనగానే చాలా మంది అభ్యర్థులు భయపడతారు. పైగా అదేదో జనరల్ నాలెడ్జ్ పరీక్షలాగా ప్రిపేర్ అవుతూ వుంటారు. అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, రాత పరీక్ష దశలోనే అభ్యర్థి యొక్క విషయ పరిజ్ఞానం తెలిసిపోయింది కనుక ఇంటర్వ్యూలో అభ్యర్థి విషయ పరిజ్ఞానం కంటే అభ్యర్థి మూర్తీమత్వానికి, ఆత్మవిశ్వాసానికి, నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం అభ్యర్థి కింది విషయాలపై ప్రధానంగా దృష్టి సాధించాలి. అవి:

 1. బయోడేటా: బయోడేటా నుంచి ప్రతీ అభ్యర్థి ప్రశ్నలను ఎదుర్కొనే అవకాశం వుంది కనుక ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో అత్యంత ప్రాధాన్యం ఈ అంశానికి ఇవ్వాలి. పైగా, ఇంటర్వ్యూ బయోడేటా ప్రశ్నలతోనే మొదలయ్యే అవకాశం వుంది కనుక మంచి సమాధానాలు చెపితే మొదట్లోనే ఇంటర్వ్యూ బోర్డుకు అభ్యర్థిపై మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం వుంది. బయోడేటాలో ప్రిపేర్ అవ్వాల్సిన అంశాలు:
  • ఇంటిపేరు మొదలుకొని కుటుంబ సభ్యుల వివరాలు,
  • స్వంత ఊరు, జిల్లా, ప్రాంత వివరాలు, విశేషాలు,
  • విద్యార్హతలు, చదువుకున్న విద్యాసంస్థల వివరాలు,
  • ఉద్యోగం చేస్తున్నట్లయితే సంస్థ వివరాలు, ఉద్యోగంలో విధులు, ఎందుకు ఉద్యోగం మారాల్సి వస్తుందో అన్న ప్రశ్నకు సమాధానం లాంటి వాటిపై పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి.
 2. వ్యక్తిత్వం (Personality): ఇంటర్వ్యూలో బోర్డు ప్రధానంగా గమనించేది అభ్యర్థి వ్యక్తిత్వాన్నే. అభ్యర్థి మానసిక పరిపక్వత, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, తార్కికంగా ఆలోచించే విధానం లాంటివి ముఖ్యంగా ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు. ఇందుకోసం కొన్ని సందర్భానుగుణమైన ప్రశ్నలు(Situational Questions) అడిగే అవకాశం ఉంది. కనుక ఇటువంటి ప్రశ్నలకు అలోచించి సమాధానం చెప్పాలి. అలాగే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తేనే చెప్పాలి, తెలియకపోతే నిజాయితీగా తెలియదని ఒప్పుకోవాలి. ఒకవేళ గెస్ చేసి సమాధానాలు చెప్తే బోర్డు సులువుగా పట్టేయగలదు
 3. భావ వ్యక్తీకరణ: ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానాలు తెలియడంతోనే సరిపోదు. వాటిని ఎలా చెప్తున్నామన్నది చాలా ముఖ్యం. సమాధానాన్ని సూటిగా, సరళంగా చెప్పాలి. బోర్డులోని మెంబర్స్ పట్ల చాలా గౌరవభావంతో మెలగాలి. సమాధానాన్ని ముందు చెప్పి తర్వాత అవసరమైన వివరణ ఇవ్వాలి.
 4. వేషధారణ: First Impression is the Best Impression. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు చక్కటి వేషధారణతో వెళ్ళాలి. ఆడంబరంగా తయారు కాకుండా సింపుల్ గా, హుందాగా వుండే డ్రెస్ వేసుకోవాలి. లైట్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. మగవారు తెలుగు లేదా ఏదైనా లేత రంగు షర్ట్, నలుపు  లేదా ఏదైనా ముదురు రంగు ప్యాంటు వేసుకోవాలి. ఆడవారు చీర లేదా చుడీదార్ ధరించవచ్చు.
 5. సామాజిక స్పృహ: సమాజంలోని సమస్యల పట్ల అభ్యర్థికి సరైన అవగాహన వుండాలి. అటువంటి సమస్యలను అర్థం చేసుకోగలిగి, వాటిని పరిష్కరించడానికి కావాల్సిన మార్గాలను చెప్పే విధంగా వుండాలి. ఉదాహరణకు మహిళలపై దాడులు, అవినీతి లాంటి సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
 6. వర్తమాన అంశాలపై పట్టు: ఇంటర్వ్యూలో వర్తమాన అంశాలపై అభ్యర్థులకు పూర్తి అవగాహన వుండాలి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. గత 6 నెలల వర్తమాన అంశాలను ప్రిపేర్ చేసుకోవాలి. కేవలం ముఖ్యమైన సంఘటనలను గుర్తుంచుకోవడమే కాక వాటిని విశ్లేషించి అర్థం చేసుకోవాలి.

ఇంటర్వ్యూలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు:

 1. “లోపలికి రావచ్చా సర్” లేదా “May I come in Sir” అని అడగనిదే ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించకూడదు
 2. ఇంటర్వ్యూ బోర్డు లోని అందరికీ విష్ చేయాలి లేదా నమస్కారం పెట్టాలి. ముందుగా బోర్డు చైర్మన్ను విష్ చేయాలి. ఉదయం పూట ఇంటర్వ్యూ ఐతే “గుడ్ మార్నింగ్” అని మధ్యాహ్నం ఐతే “గుఫ్ ఆఫ్టర్ నూన్” అని విష్ చేయాలి.
 3. బోర్డు లో ఎవరైనా ఆడవారు వుంటే వారికి ప్రత్యేకంగా విష్ చేయాలి.
 4. చైర్మన్ కూర్చోమని చెప్పనిదే అభ్యర్థి కూర్చోకూడదు.
 5. కూర్చున్న తర్వాత తప్పనిసరిగా చైర్మన్ కు థాంక్స్ చెప్పాలి.
 6. ప్రతీ సమాధానం ముందు సార్ లేదా మేడం అని సంబోధించాలి.
 7. చిరునవ్వుతో సమాధానం చెప్పాలి. తెలియకపోయినా ఒత్తిడికి గురికాకుండా తెలియదనే చెప్పాలి.
 8. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బోర్డులో అందరికీ థాంక్స్ చెప్పి బయటకు రావాలి.

One thought on “TSPSC Group 2 Interview Preparation – గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎదుర్కోవడం ఎలా?”

Comment here!